Unstoppable With NBK : వెండితెరపై ఆహా అనిపించిన బాలకృష్ణ ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫాంపై రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. ‘అన్ స్టాపబుల్’ పేరుతో టాక్ షో మొదలు కాగా, తొలి ఎపిసోడ్ లో బాలయ్య.. మంచు ఫ్యామిలీతో సందడి చేసిన సంగతి తెలిసిందే. మోహన్ బాబును నవ్విస్తూనే కఠినమైన ప్రశ్నలను అడిగి కొన్ని నిజాలను బయటపెట్టి బాలయ్య హోస్ట్ గా సక్సెస్ ని అందుకున్నారు. సినిమాలు, రాజకీయాలతోపాటు పలు అంశాలు ఈ ఇద్దరి మధ్య చర్చకు వచ్చాయి.
ఇక రెండో ఎపిసోడ్ గురించి ముందు నుంచి కూడా రకరకాల ప్రచారాలు జరుగుతూ వచ్చాయి. ఏకంగా ఐదుగురు పేర్లు వినిపించగా రెండో ఎపిసోడ్ కి నాని గెస్ట్ గా రాబోతున్నట్లుగా ఆహా వీడియో అధికారికంగా ప్రకటించింది. నాని గతంలో కృష్ణగాడి వీరప్రేమగాథ అనే సినిమాలో బాలకృష్ణ అభిమానిగా నటించారు. జై బాలయ్య అనే పేరును ఆయన ఆ సినిమాలో పచ్చబొట్టుగా పొడిపించుకున్నారు. అయితే రెండో ఎపిసోడ్‌లో నాని సందడి చేశారు. దానికి సంబంధించిన ప్రోమోను లాంచ్ చేశారు.
ప్రోమోలో చాలా ఫన్నీ అయిన సీన్స్‌ను ఇద్దరి మధ్యా చూడవచ్చు. ప్రోమో చూస్తుంటే రెండో ఎపిసోడ్ రచ్చ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా క్రికెట్ గురించిన ప్రస్తావన రావడంతోపాటు నాని తన సినీ కెరీర్‌కు చెందిన ముఖ్యమైన విషయాలను తెలిపాడు. దీంతో ఈ ఎపిసోడ్ ప్రేక్షకులను అమితంగా అలరిస్తుందని తెలుస్తోంది.
ఇక నాని సినిమాల విషయానికి వస్తే చివరిగా శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. థియేటర్లు ఓపెన్ కాకపోవడంతో సినిమాని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు. ఈ సినిమా ఫ్లాప్ కావడంతో త్వరలో విడుదల కానున్న శ్యామ్ సింగ రాయ్ చిత్రంపై హోప్స్ పెట్టుకున్నాడు. డిసెంబర్‌లో ఈ మూవీ రిలీజ్ కానుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…