Sobhita Dhulipala : గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో నాగచైతన్యపై అనేక వార్తలు వస్తున్న విషయం విదితమే. నాగచైతన్య.. నటి శోభిత ధూళిపాళతో లవ్‌లో పడ్డాడని.. ఆమెతో అతను రిలేషన్‌షిప్‌లోనూ ఉన్నాడని.. ఆమెను ఇప్పటికే తన ఫ్యామిలీకి కూడా పరిచయం చేశాడని.. ఆమె ఉన్న హోటల్‌కు చాలా సార్లు వెళ్లాడని.. ఇక త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటాడని.. అనేక వార్తలు వచ్చాయి. ప్రముఖ మీడియా సంస్థలు కూడా ఈ వార్తలను ప్రచురించాయి. టీవీ చానల్స్‌లోనూ కథనాలను ప్రసారం చేశాయి. అయితే దీనిపై నాగచైతన్య కానీ.. శోభిత కానీ స్పందించలేదు. కానీ తాజాగా శోభిత తనపై వస్తున్న రూమర్లకు ఒక వీడియో ద్వారా బదులు చెప్పింది.
శోభిత ధూళిపాళకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆమె ఆ వీడియోలో తన మధ్య వేలును చూపించడం విశేషం. ఈ క్రమంలోనే దాన్ని తనపై వస్తున్న పుకార్లకు రిప్లైగా ప్రచారం చేస్తున్నారు. ఆమె ఆ వీడియో రూపంలో బదులిచ్చిందని అంటున్నారు. తనపై లేని పోని వార్తలను ప్రచారం చేస్తున్న వారందరికీ అది వర్తిస్తుందని అన్నట్లుగా ఆమె ఆ వీడియోను పోస్ట్ చేసిందని అంటున్నారు. అయితే ఆ వీడియో నిజంగానే తనపై వస్తున్న వార్తలకు రిప్లైగా ఆమె పెట్టిందా.. లేక పాత వీడియోనా.. అన్న విషయంలో మాత్రం స్పష్టత లేదు. కానీ ఆమె ఆ వార్తలకు జవాబుగానే ఆ వీడియోను పెట్టిందని అంటున్నారు.
ఇక శోభిత ఇటీవలే మేజర్ సినిమాతో మరోమారు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో అడివి శేష్‌తో కలిసి ఈమె గూఢచారి సినిమాలో నటించి రొమాన్స్ చేసింది. అయితే అప్పట్లో శేష్‌తో కూడా ఈమె ప్రేమాయణం నడిపించిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు నాగచైతన్యతో అలాంటి వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంత ఉంది.. అనే విషయం తెలియాల్సి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…