Nagababu : మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో ఎక్కువ యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. ఆయన తన తమ్ముడు పవన్ కల్యాణ్‌కు చెందిన జనసేన పార్టీలో క్రియాశీల సభ్యుడిగా ఉన్నారు. దీంతో ఆయన పార్టీ కార్యక్రమాల్లో ప్రస్తుతం చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇటీవలే ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించారు. ఇక నాగబాబు మరోవైపు బుల్లితెరకు సైతం సమయం కేటాయిస్తున్నారు. ఈ మధ్యే తన కుమార్తె నిహారిక డ్రగ్స్ కేసులో అరెస్టు అయినప్పుడు నాగబాబు మీడియా ముందుకు వచ్చారు. తరువాత పెద్దగా బయటకు రావడం లేదు. కానీ జనసేన కార్యక్రమాల్లో అయితే పాల్గొంటున్నారు.
ఇక నాగబాబు రీసెంట్‌గా ఒక పోస్ట్ పెట్టారు. తన తండ్రి గురించి బాధాతప్త హృదయంతో ఆయన ఆ పోస్టు పెట్టినట్లు అర్థమవుతోంది. తన తండ్రికి ఆయన ఆ పోస్టు ద్వారా జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. అయితే ఆయన బతికి ఉన్నప్పుడు చెప్పాలనుకున్న కొన్ని విషయాలను చెప్పలేకపోయానని.. అప్పుడు తనకు సెన్స్ ఉండేది కాదని.. కానీ ఆ విషయాలను చెప్పాలని అనుకున్నప్పుడు ఆయన లేరని.. దీంతో బాధగా ఉందని నాగబాబు అన్నారు. ఇక ఈ సందర్భంగా ఆయన ఫ్యాన్స్‌కు కూడా ఒక సందేశం ఇచ్చారు. ఎవరైనా సరే తమ బాధలను, సంతోషాలను, సుఖాలను, దుఖాలను తల్లిదండ్రులతో, కుటుంబ సభ్యులతో అప్పటికప్పుడే పంచుకోవాలని.. లేకపోతే తగిన సమయం లభించదని.. ఆ తరువాత తనలా బాధపడాల్సి వస్తుందని అన్నారు. ఇక నాగబాబు పెట్టిన ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
కాగా నాగబాబు ఈ మధ్యే తన తల్లి జన్మదిన వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు. ఆయనకు తల్లిదండ్రులు అంటే ఎంతో ఇష్టం, గౌరవం అని చెప్పవచ్చు. తన సోదరుడు పవన్ అంటే చాలా ప్రేమ. ఆయనపై ఒక మాట కూడా పడనివ్వరు. ఎవరైనా ఏదైనా పవన్‌ను అంటే వెంటనే నాగబాబు స్పందిస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం నాగబాబు జనసేనను ఎలాగైనా అధికారంలోకి తేవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…