Sobhita Dhulipala : ఈమధ్య కాలంలో సెలబ్రిటీలకు చెందిన అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. ఏది నమ్మాలో.. ఏది నమ్మొద్దో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. అయితే వాటిల్లో కొన్ని వార్తలు నిజం అవుతున్నాయి కూడా. పవిత్ర లోకేష్, నరేష్‌లు సహజీవనం చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అది నిజమే అయింది. ఇక వారు పెళ్లి చేసుకోలేదు కానీ చేసుకుని ఉంటే అది కూడా నిజం అయి ఉండేది. దీంతో ఇతర సెలబ్రిటీ గురించి వస్తున్న వార్తలు కూడా నిజమే అని నమ్ముతున్నారు. అలాంటి వార్తల్లో నాగచైతన్య, శోభిత ధూళిపాళ కు చెందిన లవ్ ట్రాక్ వార్త కూడా ఒకటి. ఇది నిజమని చాలా మంది నమ్మారు.
నాగచైతన్య, శోభిత ఇద్దరూ లవ్‌లో ఉన్నారని.. చైతూ ఆమెను పెళ్లి చేసుకోబోతున్నాడని.. ఆమెను ఇంట్లో కుటుంబ సభ్యులకు కూడా పరిచయం చేశాడని వార్తలు వచ్చాయి. అలాగే ఆమెను పలుమార్లు హోటల్‌లో కలిశాడని కూడా వార్తలు వచ్చాయి. దీంతో వారు నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు తెగ హల్ చల్ చేశాయి. అయితే వాటిని నాగచైతన్య పీఆర్ టీమ్ ఖండించింది. ఇక తాజాగా శోభితకు కూడా ఇదే విషయంపై ప్రశ్నలు ఎదురయ్యాయి.
శోభిత తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో ముచ్చటించింది. ఈ క్రమంలోనే ఆమెకు నాగచైతన్య గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే ఆమె వాటికి చాలా తెలివిగా సమాధానాలు చెప్పింది. తనకు ట్విట్టర్‌లో ఖాతాలు లేవని.. తన పేరిట ఎవరో పెట్టిన పోస్టులను నమ్మొద్దని.. తనకు కేవలం ఇన్‌స్టాగ్రామ్ ఖాతానే ఉందని.. ఏదైనా ఉంటే అందులోనే పోస్ట్ పెడతానని చెప్పింది. దీంతో చైతూతో అలాంటి అఫెయిర్ ఏదీ లేదని ఈమె ఇన్‌డైరెక్ట్‌గా చెప్పిందని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఖండించినా ముందు ముందు ఇవే వార్తలు నిజం కావచ్చని కూడా అంటున్నారు. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…