Jabardasth Naresh : బుల్లితెరపై ఎంతో సక్సెస్ అయిన జబర్దస్త్ షో గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో చాలా మంది కమెడియన్లు తమ సత్తా చాటారు. కొందరు సినిమాల్లోనూ చాన్స్‌లను దక్కించుకుంటున్నారు. ఇక కొందరు ఈ షో ద్వారా బాగా పాపులర్ అయ్యారు. అలాంటి కమెడియన్లలో నరేష్ ఒకరు. ఈయన చేసే కామెడీ అద్భుతంగా ఉంటుంది. ఈయన కామెడీ టైమింగ్‌తోపాటు పంచ్‌లకు ప్రేక్షకులు ఫిదా అవుతుంటారు. ఈ క్రమంలోనే నరేష్ చేసే కామెడీ అద్భుతంగా ఉంటుంది. ప్రేక్షకులు ఈయనను ఎంతగానో ఇష్టపడతారు.
అయితే నరేష్ జబర్దస్త్‌లో బుల్లెట్ భాస్కర్ టీమ్‌లో చేస్తాడన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భాస్కర్ ఇటీవలే ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అందులోనూ నరేష్ గురించి పలు ముఖ్యమైన విషయాలను భాస్కర్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేష్‌కు ఏది చెప్పినా ఇట్టే గ్రహించేస్తాడని.. ఒక్క సారి చెప్పగానే స్కిట్ మొత్తాన్ని గుర్తు పెట్టుకుని మరీ అదేవిధంగా యాక్ట్ చేస్తాడని.. అలాగే అద్భుతంగా కామెడీని పండిస్తాడని భాస్కర్ తెలిపారు.
కాగా నరేష్‌ది తెలంగాణలోని వరంగల్ జిల్లా జనగామకు సమీపంలో ఉన్న అనంతపురం అనే గ్రామం. అయితే నరేష్‌కు పుట్టుకతోనే ఎదుగుదల లోపం అనే సమస్య వచ్చింది. దీంతో ఆయన అందరిలా ఎత్తు పెరగలేకపోయారు. ఈ క్రమంలోనే ఆయనకు 20 ఏళ్లకు పైగానే ఉన్నా చిన్న పిల్లాడిలా కనిపిస్తారు. అయితే నరేష్‌కు జబర్దస్త్‌లో అదే ప్లస్ అయింది. అటు పెద్దల పాత్రలో.. ఇటు పిల్లల పాత్రలోనూ.. మెప్పించగలడు. కనుకనే అవే పాత్రలు చేస్తూ నరేష్ అలరిస్తున్నాడు.
అయితే నరేష్ కు డ్యాన్స్ అంటే బాగా ఇష్టం. దీంతో ఢీ షోకు సెలెక్ట్ అయ్యాడు. తరువాత అన్నపూర్ణ స్టూడియో గేటు వద్ద సునామీ సుధాకర్ చూసి వెంటనే నరేష్‌ను జబర్దస్త్‌లోకి తీసుకునేలా చేశాడు. దీంతో మొదట చలాకి చంటి టీమ్‌లో జాయిన్ అయ్యాడు. తరువాత భాస్కర్ టీమ్‌లోకి నరేష్ వచ్చేశాడు. ఆ తరువాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. తన కామెడీతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక నరేష్ జబర్దస్త్ షో ద్వారా బాగానే సంపాదించాడు. సొంత ఊళ్లో ఇల్లు కట్టించడంతోపాటు హైదరాబాద్‌లోనూ ఫ్లాట్‌ను తీసుకున్నాడు.
అయితే నరేష్‌కు ఉన్న ఎదుగుదల లోపం అన్న వ్యాధిని నయం చేయవచ్చట. కానీ అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అంతటి రిస్క్ చేసినా ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుందట. కనుక నరేష్ అలాగే ఉండిపోయాడు. బయటికి ప్రేక్షకులను నరేష్ ఎంతగా నవ్వించినా.. తన జీవితంలో ఇంతటి విషాదం దాగి ఉందని మాత్రం ఎవరికీ తెలియదు. అయినప్పటికీ అవేవీ బయటకు కనబడనీయకుండా నరేష్ చేసే కామెడీ అద్భుతమనే చెప్పాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…