Liger : డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్‌గా పేరున్న పూరీ జగన్నాథ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన సినిమాను తెరకెక్కించే విధానమే పూర్తిగా వేరేగా ఉంటుంది. ఈ క్రమంలోనే తనదైన శైలిలో చిత్రాలను తీస్తూ పూరీ దూసుకెళ్తున్నారు. తన కెరీర్‌లో ఎన్నో ఫ్లాపులు, ఎన్నో విజయాలను అందుకున్నారు. ఒక దశలో ఆర్థికంగా చితికిపోయారు. అయినప్పటికీ రామ్‌తో ఇస్మార్ట్ శంకర్ తీసి మళ్లీ విజయాల బాట పట్టారు. ఈ క్రమంలోనే ఆయన విజయ్ దేవరకొండతో కలసి లైగర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.
కాగా విజయ్ దేవరకొండతో తీస్తున్న లైగర్ చిత్రం నుంచి ఇటీవలే విజయ్‌కి చెందిన ఓ న్యూడ్ పిక్‌ను వదిలారు. ఇది ఎంతో సంచలనాన్ని సృష్టించింది. సినిమాకు కావల్సినంత పబ్లిసిటీని తెప్పించడం కోసమే పూరీ అలా చేశారని అనుకున్నారు. ఇక ఇందులో విజయ్‌కు జోడీగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. పాన్ ఇండియా చిత్రంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ మూవీ టైటిల్ గురించి మనం చెప్పుకోవాలి. దీనికి లైగర్ అని పెట్టి.. సాలా క్రాస్ బ్రీడ్.. అనే క్యాప్షన్ ఇచ్చారు. ఇక లైగర్ అంటే అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
లైగర్ అనేది వాస్తవానికి ఒక క్రూరమృగం. లయన్, టైగర్ అనే ఆంగ్ల అక్షరాలను కలిపి ఈ టైటిల్‌ను పెట్టారని చాలా మంది అనుకున్నారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే లైగర్ అనే జంతువు కూడా ఉంది. అయితే అది క్రాస్ బ్రీడ్. అందుకనే లైగర్ చిత్రానికి కూడా క్రాస్ బ్రీడ్ అనే క్యాప్షన్ వచ్చేలా పెట్టారు. ఇక లైగర్ అంటే అర్థం ఏమిటంటే.. మగ సింహానికి, ఆడ పులికి పుట్టిన జంతువు అన్నమాట. అంటే క్రాస్ బ్రీడ్ జంతువు. కనుకనే దీన్ని లైగర్ అని పిలుస్తున్నారు. అయితే టైటిల్‌లో చూపించినట్లు లైగర్ మూవీలోనూ విజయ్ ఆ విధంగా ప్రవర్తిస్తాడా.. అన్నది సందేహంగా మారింది. ఇక ఈ విషయం సినిమా విడుదల అయితేనే తెలుస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…