Sneha Ullal : ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నటి స్నేహా ఉల్లాల్. ఈ సినిమా తరువాత మరో రెండు మూడు చిత్రాలలో నటించిన ఈమె దాదాపు తెలుగు తెరకు దూరం అయ్యి 7 సంవత్సరాలు కావస్తోంది. ఈ క్రమంలోనే ఏడు సంవత్సరాల తర్వాత స్నేహ ఉల్లాల్ మరోసారి తెలుగు తెరపై సందడి చేయనుంది.
రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రిజ్వాన్ నిర్మిస్తోన్న ఎయిట్ అనే చిత్రానికి సూర్యాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సప్తగిరి, స్నేహఉల్లాల్ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళం, కన్నడ భాషల్లో కూడా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి స్నేహఉల్లాల్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.ఈ క్రమంలోనే స్నేహఉల్లాల్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుంచి తెలుగు తెరకు దూరం కావడానికి గల కారణాన్ని తెలియజేశారు.
తాను ఇన్ని రోజుల పాటు ఇండస్ట్రీకి దూరం అవడానికి గల కారణం.. తనకు ఏ విధమైనటువంటి అవకాశాలు రాక కాదని, తను ఒక సుదీర్ఘమైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనే రక్తానికి సంబంధించిన వ్యాధితో బాధ పడుతున్నానని తెలియజేశారు. ఈ వ్యాధి పూర్తిగా తన రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపడం వల్ల గత కొన్ని రోజుల నుంచి ఇండస్ట్రీకి దూరమయ్యానని.. ఈ సందర్భంగా స్నేహ ఉల్లాల్ తెలియజేశారు.
అయితే ఇంత సుదీర్ఘ కాలం తరువాత స్నేహ ఉల్లాల్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టడంతో ఆమె ఒకప్పటిలా ఇండస్ట్రీలో సక్సెస్‌తో దూసుకుపోతుందా, లేదా.. అనేది వేచి చూస్తే తెలుస్తుంది.