సాధారణంగా కొందరికి అదృష్టం తలుపు తడితే రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారుతూ ఉంటారు. ఇలా ఒక్కసారి అదృష్టం తలుపు తడితే కొందరికి వందసార్లు దురదృష్టం తలుపు తడుతుంది. యూఏఈలో ఉండే ప్రవాస భారతీయుడికి అచ్చం ఇలాగే అదృష్టం వెనకే దురదృష్టం వచ్చింది. ఈయన లాటరీలో రూ.20 కోట్లు గెలుచుకున్నప్పటికీ డబ్బులను పొందలేకపోతున్నాడు. అసలు ఏం జరిగింది.. అనే విషయానికి వస్తే..
కేరళకు చెందిన నహీల్ నిజాముద్దీన్ అనే వ్యక్తి యూఏఈలో పని చేస్తున్నాడు. ఇతను సెప్టెంబరు 26న లాటరీ టిక్కెట్ కొనుగోలు చేసి దానికింద అతని 2 ఫోన్ నంబర్లను, కేరళ అడ్రస్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే గత ఆదివారం జరిగిన బిగ్ టికెట్ అబుదాబి సిరీస్232 డ్రాలో ఇతగాడు ఏకంగా రూ.20 కోట్లను లాటరీలో గెలిచాడు.
అయితే ఈ విషయాన్ని లబ్ధిదారుడి చేరవేయడం కోసం లాటరీ నిర్వాహకులు అతడు ఇచ్చిన ఫోన్ నంబర్లకు ఫోన్ చేశారు. అయితే ఆ రెండు ఫోన్ నంబర్లు కలవలేదు. పైగా అతని అడ్రస్ చూసి అతనికి సమాచారం అందించాలని భావిస్తే అతడు కేరళలో ఉన్న అడ్రస్ ఇచ్చాడు. దీంతో లాటరీ నిర్వాహకులు ఈ విషయాన్ని తనకు చేరవేయలేక పోయారు.
ఈ క్రమంలో ఏం చేయాలో దిక్కుతోచని నిర్వాహకులు అతడు అబుదాబిలో నివసిస్తూ ఉంటాడని ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే ఎలాగైనా అతని అడ్రస్ పట్టుకొని డబ్బులు తనకు చేరేలా చేస్తామని నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. అయితే తను రూ.20 కోట్లు లాటరీ గెలుపొందానన్న విషయం కూడా తనకు తెలియదని లాటరీ నిర్వాహకులు చెబుతున్నారు. ఇదే కదా అదృష్టం వెనకే దురదృష్టం రావడం అంటే. అతనికి డబ్బులు వచ్చినప్పటికీ వాటిని అందుకోకపోవడం నిజంగానే దురదృష్టమే. మరి చివరికి అతనికి ఆ డబ్బులు అందుతాయా, లేదా.. అనేది చూడాలి.