Sitara : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వారసురాలిగా సితార అందరికీ సుపరిచితమే. ఇంత చిన్న వయసులోనే ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సితార సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే మహేష్ బాబు నటించిన సినిమాలోని పాటలకు డాన్స్ చేస్తూ తండ్రికి ఏ మాత్రం తగ్గని తనయగా పేరు సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట చిత్రం నుంచి విడుదలైన కళావతి పాటకు డాన్స్ చేసి అందరిచేత ప్రశంసలు అందుకుంది.

ఇక ఈ చిత్రం నుంచి సెకండ్ సింగిల్ విడుదలైంది. ఈ క్రమంలోనే ఎవ్రీ పెన్నీ ఎవ్రీ పెన్నీ’ అంటూ సాగే పాటను విడుదల చేయడంతో ఇది వైరల్ గా మారింది. కాగా పాటలో భాగంగా సితార సందడి చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. తొలిసారి తండ్రితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుని వెండితెర ఎంట్రీ ఇవ్వడంతో మహేష్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ పాట విడుదల కావడంతో సితార తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తిర పోస్ట్ షేర్ చేసింది. ‘పెన్నీ సాంగ్ కోసం సర్కారు వారి పాట వంటి అద్భతమైన టీంతో పని చేయడం ఎంతో సంతోషంగా ఉంది. నాన్న నిన్ను గర్వపడేలా చేస్తా అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం సితార చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.