Ketika Sharma : అందాల ముద్దుగుమ్మ కేతిక శర్మ.. ఆకాష్ పూరీ రొమాంటిక్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత హీరో నాగ శౌర్య సరసన లక్ష్య మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా వరుస రెండు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన కేతికశర్మ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది.

మొదటి సినిమా రొమాంటిక్ చిత్రం ద్వారా ఎంతో బోల్డ్ గా కనిపించి సందడి చేసిన ఈ ముద్దుగుమ్మకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ విధంగా గ్లామర్ పాత్రలతో ప్రేక్షకులను సందడి చేస్తున్న ఈ ముద్దుగుమ్మకు సినిమా అవకాశాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ‘రంగ రంగ వైభవంగా’ అనే చిత్రం ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
మెగా హీరో వైష్ణవ్ తేజ్ సరసన ‘రంగ రంగ వైభవంగా’ చిత్రం ద్వారా మరోసారి ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియా వేదికగా స్లీవ్ లెస్ మినీ టాప్ ధరించి క్లీవేజ్ షో చేస్తూ.. మత్తెక్కించే కళ్ళతో కుర్రకారు మతులు పోగొడుతోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఈ గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.