Sitara : సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార.. తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సోషల్ మీడియాలో తన తండ్రి కన్నా బాగా పాపులర్ అవుతోంది. ఇప్పటికే మహేష్ నటించిన సర్కారు వారి పాట మూవీ లోంచి ఈమె పెన్నీ అనే సాంగ్‌కు డ్యాన్స్ చేసి అలరించింది. దీంతో సితార బాగా పాపులర్ అయింది. ఇక సోషల్ మీడియాలో ఈమె ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. కేవలం తన తండ్రి సినిమాలకు చెందిన పాటలకే కాకుండా.. ఇతర పాటలకు కూడా ఈమె డ్యాన్స్ చేస్తూ అలరిస్తుంటుంది.
అయితే సితార భవిష్యత్తులో హీరోయిన్ అవుతుందా ? అని మహేష్‌ను ఇటీవల అడగ్గా.. అందుకు ఆయన బదులిస్తూ.. ప్రస్తుత తరుణంలో పిల్లలు చాలా ఫాస్ట్‌గా ఉన్నారు. వారు ఏం అవదలుచుకుంటారో ఆ నిర్ణయాన్ని వారికే వదిలేయాలి. అయితే సినిమా ఇండస్ట్రీలోకి సితార వస్తే మాత్రం మంచి నటి అవుతుందని.. మహేష్ అన్నారు. దీంతో అందరిలోనూ ఆశ్చర్యం నెలకొంది. అయితే సితార సినిమా ఇండస్ట్రీలోకి కచ్చితంగా వస్తుందని.. తండ్రి పేరు నిలబెడుతుందని.. మహేష్ ఫ్యాన్స్ అంటున్నారు.

కాగా సితార తాజాగా మరోమారు వార్తల్లో నిలిచింది. ఆమె ఓ పాటకు డ్యాన్స్ చేసి ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అందులో సితార స్టెప్పులు అదిరిపోయేలా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆమె లేటెస్ట్ డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్లు కూడా పెడుతున్నారు. అద్భుతంగా డ్యాన్స్ చేశావని కితాబిస్తున్నారు. ఇక సితార తనకు సమంత అంటే ఎంతో ఇష్టమని గతంలో తెలియజేసింది.
View this post on Instagram