Viral Video : కోతులు.. ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది వాటి అల్లరి. కోతులు చేసే అల్లరి మామూలుగా ఉండదు. అందుకనే పిల్లలను కూడా కోతులతో పోలుస్తుంటారు. వాటికి ఆహారం కనబడితే చాలు.. అవి తినడం కన్నా.. వృథా చేసేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇళ్ల వద్ద సామాన్లు కనబడితే చాలు.. చిందరవందర చేస్తాయి. వాటి దగ్గర ఉంటే కొన్ని సార్లు మనల్ని బెదిరిస్తాయి కూడా. కనుకనే కోతి చేష్టలు అని కూడా అంటుంటారు. అయితే ఆ కోతి మాత్రం చిలిపి కోతిలా ఉంది. ఎందుకంటే అది చేసిన పని అలాంటిది మరి. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ఓ యువతి ఓ పార్కులో కూర్చుని ఉండగా.. ఆమె వెనుక నుంచి ముందుగా ఓ కోతి వచ్చింది. అయితే ఆ సమయంలో ఆ యువతి సెల్ఫీ వీడియో తీస్తోంది. ఇక ముందుగా వచ్చిన కోతి ఆమె మెడలో ఉన్న క్రిస్టల్‌ను తాకి వెళ్లింది. దీంతో ఆమె.. ఆ కోతికి నా క్రిస్టల్ అంటే ఇష్టంలా ఉంది.. అని మాట్లాడింది. ఇక వెంటనే ఇంకో కోతి వచ్చింది. అది వచ్చి ఆమె వెనుకగానే ఉంది. కానీ ఆమె మాట్లాడుతుండగానే.. ఆ కోతి వెనుకనే ఉండి ఆమె డ్రెస్‌ను పైకెత్తి చూసింది. దీంతో ఆ యువతి ఒక్కసారిగా షాకైంది. వెంటనే ఆ కోతిని తరిమేసి పెద్దగా నవ్వింది.

కాగా ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. వైరల్ అవుతోంది. దీనికి ఇప్పటికే 2.53 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 10వేలకు పైగా లైక్స్ వచ్చాయి. దీంతో ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇది చాలా చిలిపి కోతిలా ఉందే.. అని కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలోనే సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో హల్ చల్ చేస్తోంది.
View this post on Instagram