Shweta Basu Prasad : గుర్తు ప‌ట్ట‌లేకుండా మారిపోయిన కొత్త బంగారు లోకం హీరోయిన్‌..!

Shweta Basu Prasad : దాదాపు దశాబ్దం కిందట ఎక్క‌..డా.. అనే ఒక్క డైలాగ్ తో పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో క్యూట్ యంగ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన‌ కొత్త బంగారు లోకం చిత్రంలో వరుణ్ సందేశ్ కి జంటగా నటించి, క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ తో కుర్రకారును తనవైపు ఒక్కసారిగా తిప్పుకుంది శ్వేతా బసు. ఈ చిత్రంలో ఆమె చెప్పిన డైలాగ్ లు అప్పట్లో ఎంతో పాపులర్ అయ్యాయి.

మొదటి చిత్రంతోనే సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ఓవర్ గ్లామ‌ర్ షో తో సీనియర్ హీరోల సినిమాల‌లో ఛాన్సులు దక్కించుకోలేకపోయింది. తెలుగులో అవకాశాలు తగ్గిపోవడంతో తమిళం, బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టినా అక్కడ కూడా సరైన గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. అప్ప‌ట్లో లగ్జరీ లైఫ్ కి అలవాటుపడిన‌ శ్వేతా బసు డబ్బు కోసం పక్కదారులు పట్టింది అంటూ వార్తలు కూడా వినిపించాయి.

Shweta Basu Prasad

ఇక కొంత కాలం పాటూ వ్యభిచారం కేసులో చిక్కుకుని జైలు శిక్ష కూడా అనుభ‌వించింది. ఆ తరువాత ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఫిల్మ్ మేక‌ర్ రోహిత్ మిట్ట‌ల్ ను ప్రేమించి అత‌డిని 2018 లో వివాహం చేసుకుంది. అయితే పెళ్లి జీవితం కూడా శ్వేత బసు జీవితంలో ఆనందాల‌ను నింప‌లేదు. అంతే కాకుండా ఓ ఇంట‌ర్వ్యూలో త‌న భ‌ర్త ప‌లు మార్లు త‌న గ‌తం గురించి మాట్లాడుతూ మానసికంగా హింసిస్తున్నాడని తెలిపింది. ఇక పెళ్లి అయిన ఏడాదిలోపే భర్తతో విడాకులు తీసుకొని వివాహ బంధానికి స్వస్తి చెప్పింది.

ఇదిలా ఉంటే శ్వేత బసు మ‌ళ్లీ సినిమా అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది. ప్రస్తుతం శ్వేతా బసు లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటో చూసిన వారు ఎవరూ కూడా ఈమె శ్వేత అంటే నమ్మలేని విధంగా గ్లామర్ లుక్ లో కనిపిస్తుంది. అందాల ఆరబోతతో తన లేటెస్ట్ ఫోటోస్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అందర్నీ ఎంతగానో ఆకర్షిస్తుంది. మ‌రి ఈ హీరోయిన్ కు సెకండ్ ఇన్నింగ్స్ అయినా క‌లిసి వ‌స్తుందో లేదో చూడాలి.

Share
Mounika

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM