Chiranjeevi : టాలీవుడ్ కి మెగాస్టార్ చిరంజీవి ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికీ చిరు హిట్లతో ఫ్లాప్ లతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. అయితే ఇటీవల విడుదలైన మెగాస్టార్ ఆచార్య మూవీ డిజాస్టర్ అయ్యింది. అయితే దీని వెనుక ఓ బ్యాడ్ సెంటిమెంట్ కూడా ఉంది. ఆ అక్షరంతో మొదలయ్యే టైటిల్ చిరంజీవికి కలిసి రాలేదు అంటున్నారు కొందరు. ఆరాధన, ఆపద్బాంధవుడు ఫెయిల్యూర్స్ దానికి ఉదాహరణగా చెబుతున్నారు. ఈ క్రమంలో గాడ్ ఫాదర్ చిత్రానికి కూడా ఇలాంటి బ్యాడ్ సెంటిమెంట్ ఒకటి ఉందంట. మెగా హీరోలకు ముఖ్యంగా.. రామ్ చరణ్, చిరంజీవికి ఇంగ్లీష్ టైటిల్స్ కలిసి రావడం లేదు అంటున్నారు.
చిరంజీవికి కలిసిరాని ఇంగ్లీష్ టైటిల్ సెంటిమెంట్ రామ్ చరణ్ ని కూడా వెంటాడింది. చరణ్ ఇప్పటి వరకు 2 చిత్రాలను ఇంగ్లీష్ టైటిల్స్ తో చేశాడు. అవి రెండూ డిజాస్టర్ అయ్యాయి. మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత విడుదలైన ఆరంజ్, బ్రూస్లీ చిత్రాలు డిజాస్టర్ గా నిలిచాయి. ఇక చిరంజీవి కెరీర్‌లో ఇంగ్లీష్ టైటిల్ తో 10 చిత్రాల వరకు వచ్చాయి. చిరంజీవి ఇంగ్లీష్ టైటిల్ తో చేసిన మొదటి చిత్రం ఐ లవ్ యు. అప్పటికి చిరంజీవికి నటుడిగా గుర్తింపు రాలేదు. ఆ సినిమా సరిగా ఆడలేదు. తర్వాత స్టేట్ రౌడీ, బిగ్ బాస్, మాస్టర్, డాడీ, స్టాలిన్ ఇలా ఇంగ్లీష్ టైటిల్ తో చేసిన చిత్రాలు డిజాస్టర్ లేదా యావరేజ్ రిజల్ట్ అందుకున్నాయి. ఆయన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ ఇంగ్లీష్ టైటిల్ కాగా ఈ బ్యాడ్ సెంటిమెంట్ మేకర్స్ ని భయపెడుతుంది. యాంటీ ఫ్యాన్స్ ఈ విషయాన్ని హైలైట్ చేస్తున్నారు. కొందరు మాత్రం అవన్నీ మూఢనమ్మకాలని కొట్టిపారేస్తున్నారు.
ఆ మాటకొస్తే చిరంజీవి ఇంగ్లీష్ టైటిల్స్ తో బ్లాక్ బస్టర్స్ కొట్టారని గుర్తు చేస్తున్నారు. ఛాలెంజ్, గ్యాంగ్ లీడర్, హిట్లర్ వంటి చిత్రాలు ఇంగ్లీష్ టైటిల్ తో విడుదలై భారీ విజయాలను అందుకున్నాయి. కాబట్టి ఇవన్నీ అర్థం లేని ఆలోచనలని కొట్టిపారేస్తున్నారు. ఇదిలా వుండగా గాడ్ ఫాదర్ మూవీపై పరిశ్రమలో కనీస బజ్ లేదు. అలాగే మూవీపై అనేక నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమా అవుట్ ఫుట్ పట్ల సంతృప్తి చెందని సల్మాన్ హిందీ వెర్షన్ విడుదల వద్దంటున్నారట. ఆయన ఈ మూవీని ప్రమోట్ చేయడానికి ఆసక్తి చూపడం లేదట. అలాగే గాడ్ ఫాదర్ చిత్రాన్ని కొనడానికి బయ్యర్లు ముందుకు రావడం లేదంటూ అనేక పుకార్లు వినిపిస్తున్నాయి. మరో రెండు వారాలు ఆగితే టైటిల్ సెంటిమెంట్ ఎంతవరకు నిజమో తెలుస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…