Shweta Basu Prasad : దాదాపు దశాబ్దం కిందట ఎక్క..డా.. అనే ఒక్క డైలాగ్ తో పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో క్యూట్ యంగ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన కొత్త బంగారు లోకం చిత్రంలో వరుణ్ సందేశ్ కి జంటగా నటించి, క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ తో కుర్రకారును తనవైపు ఒక్కసారిగా తిప్పుకుంది శ్వేతా బసు. ఈ చిత్రంలో ఆమె చెప్పిన డైలాగ్ లు అప్పట్లో ఎంతో పాపులర్ అయ్యాయి.
మొదటి చిత్రంతోనే సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ఓవర్ గ్లామర్ షో తో సీనియర్ హీరోల సినిమాలలో ఛాన్సులు దక్కించుకోలేకపోయింది. తెలుగులో అవకాశాలు తగ్గిపోవడంతో తమిళం, బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టినా అక్కడ కూడా సరైన గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. అప్పట్లో లగ్జరీ లైఫ్ కి అలవాటుపడిన శ్వేతా బసు డబ్బు కోసం పక్కదారులు పట్టింది అంటూ వార్తలు కూడా వినిపించాయి.

ఇక కొంత కాలం పాటూ వ్యభిచారం కేసులో చిక్కుకుని జైలు శిక్ష కూడా అనుభవించింది. ఆ తరువాత ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ రోహిత్ మిట్టల్ ను ప్రేమించి అతడిని 2018 లో వివాహం చేసుకుంది. అయితే పెళ్లి జీవితం కూడా శ్వేత బసు జీవితంలో ఆనందాలను నింపలేదు. అంతే కాకుండా ఓ ఇంటర్వ్యూలో తన భర్త పలు మార్లు తన గతం గురించి మాట్లాడుతూ మానసికంగా హింసిస్తున్నాడని తెలిపింది. ఇక పెళ్లి అయిన ఏడాదిలోపే భర్తతో విడాకులు తీసుకొని వివాహ బంధానికి స్వస్తి చెప్పింది.
ఇదిలా ఉంటే శ్వేత బసు మళ్లీ సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ప్రస్తుతం శ్వేతా బసు లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటో చూసిన వారు ఎవరూ కూడా ఈమె శ్వేత అంటే నమ్మలేని విధంగా గ్లామర్ లుక్ లో కనిపిస్తుంది. అందాల ఆరబోతతో తన లేటెస్ట్ ఫోటోస్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అందర్నీ ఎంతగానో ఆకర్షిస్తుంది. మరి ఈ హీరోయిన్ కు సెకండ్ ఇన్నింగ్స్ అయినా కలిసి వస్తుందో లేదో చూడాలి.