Shruti Haasan : సౌత్ ఇండియా స్టార్స్ హీరోయిన్స్ లో ఒకరైన శృతి హాసన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తన ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ గురించి కంప్లీట్ అప్‌డేట్ ని షేర్ చేసుకుంటూనే ఉంటారు. అయితే రీసెంట్ గా యూట్యూబ్ లో షేర్ చేసిన ఓ వీడియోకి మాత్రం ఛీ.. ఛీ.. ఇదేం పాడు పని అంటూ మండిపడుతున్నారు. శృతి హాసన్ ఇలా చేస్తుందేంటి.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
రీసెంట్ గా శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్ సంతను హజారికతో కలిసి చేసిన వర్కవుట్స్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీరిద్దరూ కలిసి రకరకాల ఆసనాలు, హోమ్ వర్కవుట్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే వీటిల్లో కొన్ని భంగిమలు చూడటానికి కాస్త ఎబ్బెట్టుగా ఉన్నాయి. తన బాయ్ ఫ్రెండ్ తో కలసి రెచ్చిపోతుంది.. అంటూ నెట్టింట్లో కామెంట్స్ వస్తున్నాయి. కొన్ని వర్కవుట్స్ ని శృతి హాసన్ అవలీలగా చేసేస్తుంటే తన బాయ్ ఫ్రెండ్ మాత్రం చేయలేకపోవడం.. శృతి నేను విన్ అని అనడం.. లాంటి వాటితో ఫన్నీగా ఎంజాయ్ చేసినట్లు తెలుస్తుంది.
Shruti Haasan : చికెన్ ను వీరిద్దరూ ఆస్వాదిస్తూ తిన్నారు.
అలాగే వర్కవుట్స్ అయ్యాక.. హెల్తీ ప్రొటీన్ ఫుడ్ ని తీసుకోవడంతో పాటు ఫ్రైడ్ చికెన్ ను కూడా వీరిద్దరూ ఆస్వాదిస్తూ తిన్నారు. ఇక రీసెంట్ గా శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి షాపింగ్ ఫోటోల్ని కూడా తన ఇన్ స్టాలో షేర్ చేసుకున్నారు. శృతి లేటెస్ట్ గా ప్రభాస్ కు జోడీగా సలార్ సినిమాలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 14 న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. నెక్ట్స్ హిందీలో ఓ వెబ్ సిరీస్ లో కూడా శృతిహాసన్ నటిస్తున్నారు.