Shruti Haasan : సౌత్ ఇండియా స్టార్ హీరోయన్ గా ఎదిగి, టాప్ హీరోలకు జోడీగా నటించి కెరీర్ లో సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్న నటి శృతి హాసన్. హీరోయిన్ గా, సింగర్ గా మల్టీ టాలెంట్ తో దూసుకుపోతుంది. లేటెస్ట్ గా బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చి సూపర్ హీరోయిన్ అనిపించుకుంది. శృతి హాసన్ కు గత కొన్ని రోజులుగా అవకాశాలు తగ్గిపోయాయి. దీనికి కారణం ఆమె పర్సనల్ విషయాలే. అలాగే ఆమె సీనియర్ నటులకు జోడీగా యాక్ట్ చేయను అని ప్రామిస్ చేసింది. తన తండ్రి కమల్ హాసన్ వయస్సున్న హీరోల పక్కన యాక్ట్ చేయను అని మీడియాకి తెలిపింది.
ఈ క్రమంలో శృతి హాసన్ కు టాప్ హీరోల నుండి, డైరెక్టర్స్ నుండి ఆఫర్స్ వచ్చినా ససేమిరా యాక్ట్ చేయను అని చెప్పింది. కానీ ప్రస్తుతం తన రూల్ ను పక్కన పెట్టేసింది. లేటెస్ట్ గా బాలకృష్ణతో జోడీ కట్టడానికి సిద్ధం అయ్యింది.
గతంలో బాలయ్య సినిమాలో యాక్ట్ చేయాలని దర్శకనిర్మాతలు కోరితే శృతి నో చెప్పింది. అలాగే బాలకృష్ణ నటించిన లేటెస్ట్ సినిమా అఖండలో కూడా హీరోయిన్ కోసం చాలా కష్టపడ్డారు నిర్మాతలు. ఫైనల్ గా ప్రగ్యా జైశ్వాల్ ను హీరోయిన్ గా ఫిక్స్ చేసి షూటింగ్ పూర్తి చేశారు. అఖండ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక బాలకృష్ణ నటిస్తున్న నెక్ట్స్ మూవీకి గోపీచంద్ మలినేని డైరెక్షన్ వహిస్తున్నారు.
గోపీచంద్ డైరెక్షన్ లో ఇప్పటికే శృతి హాసన్ సినిమాలు చేసింది. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం కారణంగానే బాలకృష్ణతో సినిమాకి శృతి హాసన్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. నెక్ట్స్ టాలీవుడ్ సీనియర్ హీరోలతో కూడా యాక్ట్ చేస్తుందని టాక్ వినిపిస్తోంది.
సినీ వర్గాల అంచనా ప్రకారం నాగార్జున, వెంకటేష్, చిరంజీవిలతో కూడా శృతి హాసన్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తుందని అనుకుంటున్నారు. ఏది ఏమైనా శృతి హాసన్ సీనియర్ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం శృతి హాసన్ ప్రభాస్ కు జోడీగా సలార్ సినిమాలో యాక్ట్ చేస్తోంది.