Shriya Saran : సౌత్ ఇండియాను దశాబ్దం పాటు స్టార్ హీరోయిన్ గా ఏలింది శ్రియా సరన్. మంచి నటన, అద్భుతమైన డాన్స్ స్కిల్స్ ఆమెను స్టార్ ని చేశాయి. 2001లో విడుదలైన ఇష్టం ఆమె ఫస్ట్ మూవీ. అది హిట్ అవ్వడంతో వెంటనే నాగార్జున వంటి స్టార్ హీరో పక్కన ఛాన్స్ కొట్టేసింది. 2002లో విడుదలైన సంతోషం మూవీతో ఫస్ట్ కమర్షియల్ హిట్ అందుకుంది శ్రియా. అదే ఏడాది చెన్నకేశవరెడ్డి, నువ్వే నువ్వే ఇలా వరుస హిట్స్.. దీంతో తక్కువ కాలంలోనే స్టార్ హోదాను తెచ్చిపెట్టాయి. తద్వారా హ్యుజ్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా నిలిచింది.
అంతేకాదు సినిమాల ద్వారా ఈ అమ్మడు బోలెడన్ని కోట్లు సంపాదించిందట. నిజానికి యంగ్ హీరోయిన్స్ డబ్బుని దుబారా చేస్తారని ఓ టాక్ ఉంది. కానీ శ్రియా అలా కాదు.. వచ్చిన డబ్బులను వచ్చినట్లు పెట్టుబడులు పెడుతూ.. బిజినెస్ చేస్తూ వాటిని డబుల్ చేసిందట. ప్రస్తుతం తిని కూర్చున్నా తరగని ఆస్తి శ్రియాకి ఉందని మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఇదే విషయంపై శ్రియాని ప్రశ్నించగా.. ఈ రోజుల్లో డబ్బు లేకపోతే ఎవరు గౌరవించరని.. డబ్బులు ఉంటేనే పనులు జరుగుతాయని.. అందుకే డబ్బే ముఖ్యమని తెలుసుకొని కష్టపడి సంపాదించుకున్నానని తెలియజేసింది.
ఇప్పుడు దాన్ని ఎంజాయ్ చేస్తున్నానని.. ప్రస్తుతం భర్త, పాపతో హ్యాపీగా ఉన్నానంటూ చెప్పుకొచ్చింది. దీంతో శ్రియా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం శ్రియా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. లేటెస్ట్ సెన్సేషన్ ఆర్ఆర్ఆర్ మూవీలో అజయ్ దేవ్ గణ్ భార్యగా తళుక్కున మెరిసింది. ఇటీవల శ్రియా ప్రధాన పాత్రలో గమనం పేరుతో ఓ మూవీ విడుదలైంది. ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం. ప్రస్తుతం కన్నడలో శ్రియా ప్రధాన పాత్రలో నటించిన కబ్జా మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా చేతినిండా ఆఫర్స్ తో శ్రియా కెరీర్ ని సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…