Bigg Boss : సెప్టెంబర్ 4వ తేదీన బుల్లితెరపై ఘనంగా బిగ్ బాస్ సీజన్ 6 హంగామా మొదలైంది. మొదటి రోజు మొత్తం 21 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎప్పటిలాగే కంటిస్టెంట్స్ ఒకరికి ఒకరు పోటీపడుతూ హౌస్ లో తమ మార్క్ ను చూపిస్తున్నారు. అందరికీ షాక్ ఇచ్చేలా బిగ్ బాస్ తెలుగు చరిత్రలోనే మొదటి సారిగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంటి సభ్యులు, ఆడియెన్స్ షాక్ అయ్యేలా ఒక ప్రకటన చేశారు.
ఆటలు, పాటలు.. మధ్యలో ఎలిమినేషన్ అంటూ ఆదివారం ఎపిసోడ్‌ని మొదలు పెట్టారు హోస్ట్ నాగార్జున. చెప్పినట్లుగానే ఇంటి సభ్యులతో వెరైటీ గేమ్స్ ఆడించడం మొదలు పెట్టారు. ముందుగా ఎవరికి ఎంత తెలుసు అనే ఆట మొదలు పెట్టారు. ఇందులో భాగంగా ఇంటి సభ్యుల గురించి ప్రశ్నలు అడగటం మొదలుపెట్టారు నాగార్జున. శ్రీహాన్ హౌజ్‌లో మొదట ఏ ప్లేస్‌కు వెళ్లాడు, శ్రీసత్య శరీరంపై ఎన్ని టాటులు ఉన్నాయి లాంటి ఫన్నీ క్వశ్చన్ అండ్ ఆన్సర్‌లతో ఈ గేమ్ ముగిసింది. ఈ గేమ్‌లో నాగార్జున అడిగిన ప్రశ్నలకు ఎక్కువ జవాబు చెప్పి బాలాదిత్య స్టార్ ఆఫ్ ది వీక్ గా నిలిచాడు.
ఎలిమినేషన్‌లో ఉన్న ఐదుగురికి ఒక్కో బ్యాటన్ ఇచ్చి వాటిని ఓపెన్ చేయమని చెప్పారు నాగార్జున. అందులో బ్లూ కలర్ వచ్చినవారు సేఫ్ అని చెప్పగా, అభినయశ్రీ, ఫైమా, ఇనయా, రేవంత్, ఆరోహిలలో జబర్దస్త్ ఫేమ్ ఫైమా సేవ్ అయింది. ఆ తర్వాత బిగ్ బాస్ ఇంటి సభ్యులను ఐటమ్ నంబర్ గేమ్ ఆడించారు నాగార్జున. ఓ వస్తువును చూపిస్తే ఆ వస్తువుతో వచ్చే పాట ఏంటో కంటెస్టెంట్స్ గుర్తుపట్టాలి. ఈ గేమ్ కోసం ఇంటి సభ్యుల్ని ఎ, బి అనే టీమ్‌లుగా విభజించారు. ఎ టీమ్ లో రేవంత్, చంటి, శ్రీసత్య, అభినయశ్రీ, నేహా, అర్జున్, మెరీనా, రోహిత్, కీర్తి, షానీ, ఇనయా ఉండగా, మిగతావాళ్లు బి టీమ్ లో ఉన్నారు. ఈ ఆటలో టీమ్ ఎ సభ్యులు విజయం సాధించారు.
ఇక ఆట మధ్యలో రేవంత్ సేవ్ అయినట్లు వెల్లడించారు. చివరగా ఎలిమినేషన్‌లో ఇనయా సుల్తానా, అభినయశ్రీ మిగిలారు. వీరిద్దరినీ గార్డెన్ ఏరియాకి పిలిచిన నాగార్జున అక్కడ ఉన్న రెండు భారీ సుత్తులను ఎత్తాల్సి ఉంటుంది. సుత్తి లేపలేని వారు ఎలిమినేట్ అవుతారని తెలిపారు. కానీ ఇద్దరూ లేపడంతో అందరూ షాక్ అయ్యారు. దీంతో ఇద్దరు సభ్యులు సేవ్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. హౌస్‌లోకి వచ్చి వారమే అవుతుంది కాబట్టి, ఇప్పుడిప్పుడే అందరూ సెటిల్ అవుతున్నారు. అందుకే ఈ వారం ఎలిమినేషన్ లేదు అని నాగార్జున వెల్లడించడంతో కంటెస్టెంట్స్ ఎంతో హ్యాపీగా ఫీలయ్యారు. ఈ ఆదివారం షో సండే ఈజ్ ఫన్ డే అన్నట్లు ఆటలతో సరదాగా, ఎలిమినేషన్ లతో టెన్షన్ గా, ఫైనల్ గా హ్యాపీగా ముగిసింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…