Ram Gopal Varma : వివాదాలు సృష్టించడంలో ముందు వరసలో ఉండే వ్యక్తి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ప్రతి విషయంపై తనదైన రీతిలో స్పందిస్తూ ఉంటాడు. అవి కాస్తా కాంట్రవర్సీలకు దారి తీస్తూ ఉంటాయి. తాజాగా ఆయన కృష్ణం రాజు మృతిపై స్పందిస్తూ చేసిన వాఖ్యలు తెలుగు సినీ పరిశ్రమలో దుమారం రేపుతున్నాయి. ఇక ఆయన ట్విట్టర్ వేదికగా తెలుగు ఇండస్ట్రీకి చెందిన పలువురు హీరోలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం చర్చనీయాంశం అవుతోంది.
సీనియర్ నటుడు కృష్ణం రాజు మృతితో తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. అయితే దీనిపై వరుస ట్వీట్లు చేస్తున్న రామ్ గోపాల్ వర్మ తెలుగు చిత్ర పరిశ్రమలోని పెద్దలపై విరుచుకు పడుతున్నాడు. ఆయన ట్విట్టర్ అకౌంట్ ద్వారా కృష్ణం రాజు మరణంపై తన అభిప్రాయాలను రాస్తూ.. భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు లాంటి అత్యంత గొప్ప చిత్రాలని అందించిన మహా నటుడు, గొప్ప నిర్మాత కోసం ఒక్క రోజు కూడా షూటింగ్ ఆపలేని అత్యంత స్వార్ధపూరిత తెలుగు సినిమా పరిశ్రమకి నా జోహార్లు.. సిగ్గు..! సిగ్గు..! అని తీవ్ర పదజాలంతో రాయడం జరిగింది.
అంతటితో ఆగకుండా.. కృష్ణ గారికి, మురళీ మోహన్ గారికి, చిరంజీవి గారికి, మోహన్ బాబు గారికి, బాలయ్యకి, ప్రభాస్ కి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లకి నేను ఈ విషయం మీద మనవి చేసేదేంటంటే రేపు ఇదే దుస్థితి మీలో ఎవరికీ కూడా తప్పదు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది.. అంటూ సినీ పెద్దలను ఘాటుగా విమర్శించాడు.
ఇంకా సినిమా షూటింగ్ లు ఆపక పోవడంపై తన అసహనం తెలుపుతూ.. మనసు లేకపోయినా ఓకే. కనీసం మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజు గారి లాంటి పెద్దమనిషికి విలువ ఇద్దాం.. కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదాం. డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతోంది అని నెలరోజులు షూటింగ్ ఆపేసిన పరిశ్రమ మనది.. అంటూ షూటింగ్ లు ఆపడానికి పిలుపునిచ్చారు. ఈ విషయంలో రామ్ గోపాల్ వర్మ వరుస ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. కానీ తెలుగు చిత్ర పరిశ్రమ ఆయనను పట్టించుకుంటుందో లేదో అని పలువురు భావిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…