Shivathmika Rajashekar : రాజశేఖర్ జీవిత ముద్దుల తనయ శివాత్మిక రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన దొరసాని సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇలా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శివాత్మిక సినిమాలలో ఎంతో పద్ధతిగా నటిస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ప్రస్తుత ట్రెండ్ ను ఫాలో అవుతోంది.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారు మతులు పోగొడుతోంది. ప్రస్తుతం ఈమె ఎంతో క్యూట్ లుక్స్ తో ఉన్న ఒక ఫోటోని షేర్ చేసింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మంది నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ ఫోటోలో శివాత్మిక లుక్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

ఇక ప్రస్తుతం ఈమె పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇండస్ట్రీలోకి రాజశేఖర్ కూతురు శివాత్మిక మాత్రమే కాకుండా శివాని కూడా అద్భుతం సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఇలా రాజశేఖర్ ఇద్దరు కూతుళ్లు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంటున్నారని చెప్పవచ్చు.
