Shivathmika Rajashekar : ఒకప్పుడు టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మలు చాలా పద్దతిగా కనిపించే వారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. పొట్టి దుస్తులలో నానా రచ్చ చేస్తూ ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు. హీరోల కూతుళ్లు కూడా తగ్గేదేలే అంటున్నారు. రాజశేఖర్-జీవిత ముద్దుల కూతురు శివాత్మిక గ్లామర్ షోతో నెట్టింట మంట పెడుతోంది. ఈ ముద్దుగుమ్మ అరాచకానికి సోషల్ మీడియా షేక్ అవుతోంది. ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్న శివాత్మిక పొట్టి దుస్తులలో ఫుల్‌గా గ్లామర్ షో చేస్తూ కేక పెట్టిస్తోంది. తాజాగా ఈ అమ్మడు టైట్ డ్రెస్‌లో ఎద అందాలు చూపిస్తూ పనిలో పనిగా థైస్ షో కూడా చేసింది. శివాత్మిక క్యూట్ లుక్స్‌కి కుర్రకారు మైమరచిపోతున్నారు.

2019లో విడుదలైన దొరసాని మూవీతో శివాత్మిక వెండితెరకు పరిచయం అయింది. పీరియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కిన దొరసాని మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాకున్నా శివాత్మిక ప్రతిభ కనబరిచింది. దొర కూతురు పాత్రలో శివాత్మిక అలరించింది. మొదటి చిత్రమే అయినా చక్కని నటనతో శివాత్మిక ఆకట్టుకుంది. అయితే శివాత్మికకు అనుకున్న స్థాయిలో ఆఫర్స్ దక్కడం లేదు. బ్యాక్ గ్రౌండ్ ఉండి కూడా, కెరీర్ మెల్లగా సాగుతోంది. అక్క శివాని కంటే ముందే కెరీర్ ప్రారంభమైనా బ్రేక్ రాలేదు. రాబోయే చిత్రాలలో తానేమిటో నిరూపించుకొని, హీరోయిన్ గా నిలదొక్కుకోవాలని చూస్తోంది.
ప్రస్తుతం శివాత్మిక దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో కీలక రోల్ చేస్తోంది. ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ, బ్రహ్మానందం ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అనసూయ సైతం ఈ చిత్రంలో నటిస్తోంది. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ విడుదల తేదీపై స్పష్టత రాలేదు. మరోవైపు బ్రహ్మానందం పంచతంత్రం సినిమాలోనూ నటిస్తోంది. శివాత్మిక ఇండస్ట్రీలో డీసెంట్ నేమ్ తెచ్చుకున్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం ట్రెండ్‌ని ఫాలో అవుతోంది. నేటి ట్రెండ్‌కి ఎలా ఉండాలో అలాగే ముస్తాబవుతోంది.