Shakeela : కోట్ల రూపాయ‌లు సంపాదించినా.. క‌ష్టాల్లోనే ష‌కీలా.. ఆమెను మోసం చేసింది ఎవ‌రు..?

Shakeela : 1990 ప్రారంభంలో బి-గ్రేడ్ మలయాళ చిత్రాలతో నటిగా షకీలా సినీ కెరీర్ ప్రారంభమైంది. ఆమె మొట్టమొదటి చిత్రం ప్లేగర్ల్స్. దీనిలో ఆమె సహాయక నటిగా నటించింది. ఆ తర్వాత తెలుగులో మొట్ట మొదట తేజ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన జయం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. జయం చిత్రంతో షకీలా ఇమేజ్ మారిపోయింది. చాలా తెలుగు సినిమాల్లో బోల్డ్ క్యారెక్టర్ లో నటించి కుర్ర కారును తనవైపుకు తిప్పుకుంది.

100 కు పైగా సినిమాల్లో నటించి నటన పరంగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. మొదట్లో షకీలా అసలు శృంగార పాత్రలు చేసేది కాదు. కానీ ఆమెకు వ్యాంప్ పాత్రలు మాత్రమే రావడంతో ఈమె వ్యాంప్ ఆర్టిస్ట్ గా ముద్ర వేసుకుంది. నాగ, జయం, పుట్టింటికి రా చెల్లి వంటి చిత్రాల్లో హాస్యంతో కూడిన శృంగార పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించింది. కొన్ని మలయాళ చిత్రాల్లో షకీలా లీడ్ రోల్ లో నటించింది. ఇలాంటి క్యారెక్టర్లు చేస్తూ షకీలా ఎంతో డబ్బు వెనక వేసుకొని లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఆమె జీవితంలో ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొన్న సంగతి చాలా మందికి తెలియదు.

Shakeela

తోడబుట్టిన అక్క తనను దారుణంగా మోసం చేసింద‌ని షకీలా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. తను సినిమాల్లో కష్టపడి సంపాదించిన రూ.2 కోట్ల డబ్బును తన అక్కకు ఇచ్చినట్టు తెలిపింది. అయితే ఆ డబ్బు తిరిగి ఇవ్వమని అడిగితే తాను వేరే వ్యక్తిని న‌మ్మి అత‌డికి ఇచ్చి మోసపోయాను అని త‌న సోద‌రి చెప్ప‌డంతో తాను కూడా మోస‌పోయాన‌ని ష‌కీలా ఆ ఇంటర్వ్యూ ద్వారా తెలియజేసింది.

బయట వ్యక్తులు మోసం చేస్తే మనం వాళ్ల పై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. కానీ నా అనుకునే సొంతవాళ్లే మోసం చేస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం షకీలా ఓ ట్రాన్స్ జెండర్ తో కలిసి హైదరాబాద్‌లో నివాసం ఉంటుంది. ఆ ట్రాన్స్ జెండర్ తన కుమార్తె అని షకీలా తెలియజేసింది.

Share
Mounika

Recent Posts

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM

Devara Ticket Prices : అభిమానుల‌కు భారీ షాకిచ్చిన దేవ‌ర టీమ్‌.. టిక్కెట్ల రేట్ల‌ను భారీగా పెంచారుగా..!

Devara Ticket Prices : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం త‌ర్వాత న‌టించిన చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ…

Monday, 16 September 2024, 6:57 AM