Karate Kalyani : తెలుగు సినీ నటి, బిగ్ బాస్ ఫేమ్ కరాటే కళ్యాణి గురించి అందరికీ తెలిసిందే. ఈమె సినిమాల్లో ఎన్నో బోల్డ్ పాత్రల్లో నటించింది. బయట కూడా ఈమె ఎంతో బోల్డ్ గా మాట్లాడుతూ ఉంటుంది. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత కాలం తన మాటలతో బాగా రెచ్చిపోయింది. కరాటే కల్యాణి తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించినా రానీ గుర్తింపు వి.వి.వినాయక్ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన కృష్ణ సినిమాలో బ్రహ్మానందాన్ని బాబీ అంటూ ఓ రకంగా పిలిచిన పిలుపుతోనే బాగా పాపులర్ అయ్యింది.
నటిగా బిజీగా ఉంటూనే ఈ మధ్యకాలంలో సమాజంలో జరిగే సంఘటనలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంది. అయితే ఆమెకు వ్యక్తిగత జీవితం కలిసి రాలేదు. ఆమె ప్రేమించినోడు.. పెళ్లి చేసుకున్నోడు కూడా తనను మోసం చేశారని ఎన్నోసార్లు వాపోయింది. ప్రస్తుతం రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తోంది. బీజేపీలో చేరిన కరాటే కల్యాణి ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్లపై నిప్పులు చెరుగుతూ ఉంటుంది. ఇక చెప్పేవి నీతులు చేసేవి బూతు పాత్రలు అని విమర్శలు రావడంతో గత కొద్ది రోజులుగా వ్యాంప్ పాత్రలకు కూడా కరాటే కల్యాణి గుడ్ బై చెప్పేసింది.
ఇప్పుడు కేవలం రాజకీయాల్లో కొనసాగుతోంది. అయితే కొన్ని ఇంటర్వ్యూల్లో కల్యాణి మాట్లాడుతూ పూర్తిగా సినిమాలకు కూడా గుడ్ బై చెబుతా అంటూ వ్యాఖ్యానించింది. అంతే కాకుండా హరికథలు, పురాణాలు చెబితే రాని గుర్తింపు తనకు వ్యాంప్ పాత్రల ద్వారా వచ్చినట్టు తెలిపింది. సినిమాల్లోకి వచ్చి తాను పైట జారిస్తే మాత్రం ప్రేక్షకులు ఆదరించారు అని పేర్కొంది. ఇప్పటికీ తాను ఏ షో కు వెళ్ళినా బాబీ అంటూ పిలుస్తారని చెప్పింది. తనను గుర్తు పట్టినందుకు సంతోషపడాలో లేదంటే.. తనకు వచ్చిన క్రేజ్ వ్యాంప్ పాత్రల వల్లే వచ్చిందని బాధపడాలో అర్థంకాదని ఆవేదన వ్యక్తం చేసింది కరాటే కల్యాణి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…