Shakeela : 1990 ప్రారంభంలో బి-గ్రేడ్ మలయాళ చిత్రాలతో నటిగా షకీలా సినీ కెరీర్ ప్రారంభమైంది. ఆమె మొట్టమొదటి చిత్రం ప్లేగర్ల్స్. దీనిలో ఆమె సహాయక నటిగా నటించింది. ఆ తర్వాత తెలుగులో మొట్ట మొదట తేజ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన జయం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. జయం చిత్రంతో షకీలా ఇమేజ్ మారిపోయింది. చాలా తెలుగు సినిమాల్లో బోల్డ్ క్యారెక్టర్ లో నటించి కుర్ర కారును తనవైపుకు తిప్పుకుంది.
100 కు పైగా సినిమాల్లో నటించి నటన పరంగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. మొదట్లో షకీలా అసలు శృంగార పాత్రలు చేసేది కాదు. కానీ ఆమెకు వ్యాంప్ పాత్రలు మాత్రమే రావడంతో ఈమె వ్యాంప్ ఆర్టిస్ట్ గా ముద్ర వేసుకుంది. నాగ, జయం, పుట్టింటికి రా చెల్లి వంటి చిత్రాల్లో హాస్యంతో కూడిన శృంగార పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించింది. కొన్ని మలయాళ చిత్రాల్లో షకీలా లీడ్ రోల్ లో నటించింది. ఇలాంటి క్యారెక్టర్లు చేస్తూ షకీలా ఎంతో డబ్బు వెనక వేసుకొని లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఆమె జీవితంలో ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొన్న సంగతి చాలా మందికి తెలియదు.

తోడబుట్టిన అక్క తనను దారుణంగా మోసం చేసిందని షకీలా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. తను సినిమాల్లో కష్టపడి సంపాదించిన రూ.2 కోట్ల డబ్బును తన అక్కకు ఇచ్చినట్టు తెలిపింది. అయితే ఆ డబ్బు తిరిగి ఇవ్వమని అడిగితే తాను వేరే వ్యక్తిని నమ్మి అతడికి ఇచ్చి మోసపోయాను అని తన సోదరి చెప్పడంతో తాను కూడా మోసపోయానని షకీలా ఆ ఇంటర్వ్యూ ద్వారా తెలియజేసింది.
బయట వ్యక్తులు మోసం చేస్తే మనం వాళ్ల పై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. కానీ నా అనుకునే సొంతవాళ్లే మోసం చేస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం షకీలా ఓ ట్రాన్స్ జెండర్ తో కలిసి హైదరాబాద్‌లో నివాసం ఉంటుంది. ఆ ట్రాన్స్ జెండర్ తన కుమార్తె అని షకీలా తెలియజేసింది.