Sheela Kaur : ఒకప్పుడు వెండితెరపై తమ అందచందాలతో ప్రేక్షకులని అలరించిన ముద్దుగుమ్మలు కొన్నాళ్లకు ఫేడ్ ఔట్ అయిపోతున్నారు. పలు కారణాల వల్ల సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. నమ్మవేమో కానీ.. అందాల యువరాణి.. నేలపై వాలిందీ.. నా ముందే నిలిచింది.. అంటూ అల్లు అర్జున్‌తో విరహగీతాలు పాడించి పరుగు పెట్టించిన పరుగు హీరోయిన్ షీలా కౌర్ తెలుగు ప్రేక్షకులని చాలా మెప్పించింది. ప్రముఖ వ్యాపారవేత్త సంతోష్ రెడ్డిని పెళ్లాడింది షీలా. అల్లు అర్జున్‌తో పరుగు, ఎన్టీఆర్‌తో అదుర్స్, రామ్‌తో మస్కా చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మకు ఆఫర్స్ తగ్గిపోవడంతో చివరిగా బాలయ్య పరమవీర చక్ర సినిమాలో నటించింది.

హలో ప్రేమిస్తారా, రాజు భాయ్, సీతాకోక చిలుక తదితర చిత్రాలతోపాటు కన్నడ, మళయాళం లలో పాతికకి పైగా చిత్రాల్లో నటించింది షీలా. ఎన్ని సినిమాలు చేసినా షీలాకి మంచి హిట్స్ పడకపోవడంతో ఈ అమ్మడు నెమ్మదిగా ఇండస్ట్రీ నుంచి తప్పుకుంది. ఇటీవల బక్కచిక్కి గుర్తుపట్టలేనంతగా కనిపించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది చూసి అందరూ షాక్ అయ్యారు. ఒకప్పుడు అంత అందంగా ఉన్న షీలా ఇలా మారిందేమిటని ముచ్చటించుకుంటున్నారు. తెలుగులో ప్రముఖ సీనియర్ దర్శకుడు ఏఆర్ రాజా దర్శకత్వం వహించిన సీతాకోక చిలుక అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైంది.
షీలాకు క్యాన్సర్ వాధి ఉండగా, ఆ విషయం ఎప్పుడు చెప్పుకోలేదు. ప్రస్తుతం ఆమె క్యాన్సర్‌తో పోరాడుతుందని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఒకప్పుడు హీరోయిన్‌గా ఎంతగానో అలరించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సూపర్ మార్కెట్ నడుపుకుంటూ జీవనం సాగిస్తుందట. ఈ విషయం తెలుసుకొని ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు. పరమవీరచక్ర చిత్రం తర్వాత షీలా తెలుగు తెరపై కనిపించలేదు. మళ్లీ తిరిగి ఎప్పుడు తెలుగు రానుంది.. అనే విషయంపై మాట్లాడుతూ.. ఇంప్రెస్ చేసే స్క్రిప్టుతో ఎవరైనా వస్తే తప్పుకుండా తిరిగి వస్తాను.. అదే సమయంలో ఎన్ని రోజులు షూటింగ్ డేస్ ఉంటాయనేది కూడా నాకు ముఖ్యమే.. ఆ రెండూ చూసుకునే నేను డెసిషన్ తీసుకుంటాను.. అంది షీలా.