Pragathi : సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటి ప్రగతి ఎంత పేరు తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎంతో మంది హీరోలకు తల్లిగా నటించి మెప్పించింది. అలాగే పిన్నిగా, వదిన, అక్కగా కూడా నటించింది. అయితే సోషల్ మీడియాలో ఈమె చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ డ్యాన్స్ వీడియోలను ఈమె అందులో పోస్ట్ చేస్తుంటుంది. దీంతో ఆ వీడియోలు వైరల్ అవుతుంటాయి. సినిమా పాటలకు ప్రగతి చేసే డ్యాన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మంది ఫాలోవర్లే ఉన్నారు.

ఇక ప్రగతి ఫిట్‌నెస్ విషయంలోనూ ఎంతో శ్రద్ధ వహిస్తుంటుంది. అందుకనే జిమ్‌లో గంటల తరబడి సాధన చేస్తుంటుంది. ఈ వయస్సులోనూ ఈమె ఎంతో ఫిట్‌గా కనిపిస్తుందంటే.. ఆమె చేసే ఎక్సర్‌సైజులే కారణమని చెప్పవచ్చు. ఈమె ఫిట్‌నెస్‌ను, అందాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు. ఇక తాజాగా నటి ప్రగతి తన పుట్టిన రోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల నడుమ ప్రగతి బర్త్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.
అయితే ఈ బర్త్ డే వేడుకలకు ప్రగతి ధరించిన డ్రెస్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. ఎద అందాలను ప్రదర్శిస్తూ మునుపెన్నడూ లేనివిధంగా ప్రగతి రచ్చ చేసింది. దీంతో ఆమె బర్త్ డే ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమెకు చాలా మంది కేక్ తినిపిస్తూ బర్త్ డే విషెస్ చెప్పారు. అలాగే ఆమె ఫొటోలకు కూడా కామెంట్లు పెట్టారు.
ఇక తన బర్త్ డే సందర్భంగా ప్రగతి కూడా స్పందించింది. ఇది తనకు చాలా బెస్ట్ బర్త్ డే అని.. ఇంతకు ముందు ఎన్నడూ ఇలా బర్త్ డేను జరుపుకోలేదని.. ఆమె స్పష్టం చేసింది. తనకు బర్త్ డే విషెస్ చెప్పిన అందరికీ ఈమె ధన్యవాదాలు తెలియజేసింది. ఇక ప్రగతి ఫొటోలను చూసి అందరూ షాకవుతున్నారు. ఇంతలా గ్లామరస్‌గా ఆమె ఎప్పుడూ కనిపించలేదని అంటున్నారు.