Aishwarya Rajinikanth : తమిళ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన రజనీకాంత్ కు అల్లుడు కాకముందే హీరోగా నిలదొక్కుకున్నాడు. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ ఏడాది జనవరిలో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌లు విడాకులు తీసుకుంటున్నట్లు తెలిపారు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. టాలీవుడ్ లో నాగచైతన్య, సమంతల విడాకుల వ్యవహారం ఎంతలా సంచలనం సృష్టించిందో తమిళనాడులోనూ ధనుష్, ఐశ్వర్యల విడాకుల వార్త సెన్సేషన్ అయింది. అయితే వారిని కలిపి ఉంచేందుకు రజనీకాంత్ శతవిధాలా ప్రయత్నించారట. కానీ విఫలం అయ్యారట. ఇక ఆ తరువాత కూడా పలు కార్యక్రమాల్లో వీరు ఎదురు పడ్డారు. కానీ పలకరించుకోలేదు.
అయితే తాజాగా ధనుష్, ఐశ్వర్యల విడాకులకు సంబంధించి ఫిలిం నగర్‌లో ఒక వార్త అయితే చక్కర్లు కొడుతోంది. వీరు విడిపోవడానికి ప్రధాన కారణం ఓ బాలీవుడ్ హీరోయిన్ అని అంటున్నారు. సైఫ్ అలీ ఖాన్ ముద్దుల కుమార్తె సారా అలీ ఖాన్‌తో కలిసి ధనుష్ అత్రంగీ రే అనే సినిమా చేశాడు. అయితే సారా వల్లే ధనుష్.. ఐశ్వర్యకు విడాకులు ఇచ్చాడని అంటున్నారు. వారి విడాకులకు సారా అలీ ఖానే కారణమని అంటున్నారు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ సారాను తిట్టి పోస్తున్నారు.

ఇక సారా అలీ ఖాన్ ఈ మధ్యే కరణ్ జోహార్ నిర్వహించిన కాఫీ విత్ కరణ్ ప్రోగ్రామ్‌కు హాజరై సంచలన వ్యాఖ్యలు చేసింది. డేటింగ్ చేసేందుకు పెళ్లయిన హీరో అయినా ఓకే అని చెప్పింది. దీంతో సారా వల్లే ధనుష్, ఐశ్వర్యలు విడిపోయారనే వార్తలకు బలం చేకూరినట్లు అయింది. ఇక తాజాగా ధనుష్, సారా అలీఖాన్ ఇద్దరూ ఓ కార్యక్రమానికి కలసి హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా పుకార్లు బయటకు వచ్చాయి. ధనుష్, ఐశ్వర్యల విడాకులకు సారా నే కారణమని అంటున్నారు. అయితే ఇదంతా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమే. ఇందులో నిజం ఎంత ఉంది.. అన్న విషయం తెలియాల్సి ఉంది. ఇక ధనుష్ ఇటీవలే ది గ్రే మ్యాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్‌లో నేరుగా రిలీజ్ అయింది. బాక్సాఫీస్ ఈ మూవీకి మిక్స్‌డ్ టాక్ వస్తోంది.