Sania Mirza : చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ తాజాగా టీ20 వరల్డ్ కప్‌లో తలపడిన విషయం విదితమే. అయితే ఈ మ్యాచ్‌లో వార్ వన్ సైడే అన్నట్లుగా పాకిస్థాన్ బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో భారత్‌ను డామినేట్ చేసింది. దీంతో ఎన్నో ఏళ్లుగా ఉన్న రికార్డును పాక్ తిరగరాసింది. ఐసీసీ టోర్నీల్లో భారత్‌పై తొలిసారిగా గెలుపొందింది.
అయితే ఈ మ్యాచ్‌లో పాక్ జట్టులో ఆడుతున్న షోయబ్ మాలిక్ ఆ జట్టులోనే అత్యంత సీనియర్ ఆటగాడిగా పేరుపొందాడు. పాక్ ఫీల్డింగ్ సమయంలో అతను బౌండరీ వద్ద నిలుచున్నాడు. అయితే అదే సమయంలో కొందరు భారత జట్టు ఫ్యాన్స్ అతన్ని ‘జిజాజీ’ (బావ) అని పిలిచారు. చప్పట్లు కొట్టారు. దీంతో మాలిక్ వెనక్కి తిరిగి తాను కూడా వాళ్లను ఉత్సాహ పరిచాడు. చేత్తో సైగలు చేశాడు. ఆ సమయంలో తీసిన వీడియో వైరల్‌గా మారింది.
కాగా ఆ వీడియోకు సానియా మీర్జా స్పందించింది. విపరీతమైన నవ్వు, ప్రేమతో కూడిన ఎమోజీలను కామెంట్‌గా పెట్టి ఆ వీడియోను రీట్వీట్ చేసింది. ఆమె పోస్టు వైరల్‌గా మారింది. అయితే మ్యాచ్ భారత్, పాకిస్థాన్ ల మధ్య అయినప్పటికీ ప్లేయర్లు మాత్రం క్రీడాస్ఫూర్తిని కనబరిచారు. మ్యాచ్ సందర్బంగా ఎలాంటి గొడవలు చోటు చేసుకోలేదు. పైగా కోహ్లి పాక్ ప్లేయర్లను మనస్ఫూర్తిగా అభినందించి అందరి మనస్సులను గెలుచుకున్నాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…