IPL : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022వ ఎడిషన్ మరింత రసవత్తరంగా సాగనుంది. మరో రెండు కొత్త టీమ్‌లు వచ్చి చేరాయి. బీసీసీఐ సోమవారం సాయంత్రం రెండు కొత్త ఐపీఎల్ టీమ్‌లను ప్రకటించింది. లక్నో, అహ్మదాబాద్ టీమ్‌లను ఐపీఎల్‌లో చేరుస్తున్నట్లు బీసీసీఐ తెలియజేసింది. ఈ మేరకు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
లక్నో టీమ్‌ను ఆర్‌పీ సంజీవ్ గోయెంకా గ్రూప్ రూ.7090 కోట్లకు సొంతం చేసుకోగా.. అహ్మదాబాద్ టీమ్‌ను రూ.5100 కోట్లకు సీవీసీ కాపిటల్ సొంతం చేసుకుంది. కాగా గోయెంకా గ్రూప్ గతంలో ఐపీఎల్‌కు చెందిన పూణె ఫ్రాంచైజీని సొంతం చేసుకున్నారు. 2 ఏళ్ల పాటు ఆ టీమ్ కొనసాగింది. తరువాత పలు కారణాల వల్ల ఆ టీమ్‌ను రద్దు చేశారు.
ఇక టీమ్ ల కోసం అదానీ గ్రూప్, గోయెంకా గ్రూప్, హిందుస్థాన్ టైమ్స్ మీడియా, గ్లేజర్ ఫ్యామిలీ, అరబిందో, సీవీసీ కాపిటల్ భారీ ధరలకు బిడ్లను వేసినట్లు తెలుస్తోంది. వీరితోపాటు కోటక్ గ్రూప్, టొరెంట్ గ్రూప్‌లు కూడా బిడ్డింగ్‌లో పాల్గొన్నాయి. అయితే డిసెంబర్ లో ఐపీఎల్ ఆటగాళ్లను మొత్తంగా వేలం వేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే సీజన్‌లో అన్ని టీమ్ లలోనూ కొత్త ముఖాలు దర్శనమివ్వనున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…