Samantha Naga Chaithanya : ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న చందంగా మారింది.. సమంత, నాగచైతన్యల కామన్ స్నేహితుల పరిస్థితి. ఆ జంట విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడంలో ఆ ఇద్దరికీ కామన్‌గా ఉన్న స్నేహితులకు ఏమీ పాలుపోవడం లేదట. ఎవరికి సపోర్ట్ ఇస్తే ఎవరు ఏమనుకుంటారోనని వారు సైలెంట్‌గా ఉంటున్నట్లు తెలుస్తోంది.
సమంత, నాగచైతన్య ఎన్నో సంవత్సరాలు ప్రేమించుకుని ఆ తరువాత పెళ్లి చేసుకున్నారు. తరువాత వీరు టాలీవుడ్‌లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు. అయితే ఎవరికి కన్నుకుట్టిందో.. ఏ దేవుడి శాపమో తెలియదు కానీ.. ఈ ఇద్దరూ విడిపోయారు. అత్యంత బాధతో ఈ నిర్ణయం తీసుకున్నారు. విడాకుల ప్రకటన అనంతరం సమంత వరుస సినిమాలకు ఒప్పుకుంటూ ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తోంది. ఇక నాగచైతన్య కూడా వరుసగా సినిమాలను చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ ఇద్దరికీ పరిచయం ఏర్పడినుంచి ఇప్పటి వరకు కామన్ గా స్నేహితులు కొందరు ఏర్పడ్డారు. వారు సమంతకు, నాగచైతన్యకు కంబైన్డ్‌గా స్నేహితులే. ఈ ఇద్దరూ కలసి ఉన్నన్ని రోజులూ ఆ కామన్ ఫ్రెండ్స్ వీరి కార్యక్రమాలకు వెళ్లేవారు. పార్టీలు చేసుకునేవారు. అయితే ఈ జంట విడిపోయాక.. ఆ కంబైన్డ్ ఫ్రెండ్స్ వీరికి దూరంగా ఉంటున్నారట. ఎందుకంటే.. వారు అటు సమంతకే కాక, ఇటు నాగచైతన్యకూ స్నేహితులే కదా. కనుక కంబైన్డ్ ఫ్రెండ్స్ కాబట్టి.. ఇద్దరి నుంచీ దూరంగా ఉండాలని అనుకుంటున్నారట.
కేవలం సమంత వద్దకో లేదా నాగచైతన్య వద్దకో వెళితే.. తమకు ఎవరు కావాలో వారిని ఎంచుకున్నట్లు అవుతుంది. దీంతో ఇంకొకరికి దూరం కావల్సి వస్తుంది. ఇది ఇష్టం లేకే ఆ కంబైన్డ్ ఫ్రెండ్స్ ఎవరి వద్దకూ వెళ్లడం లేదట. కొంత కాలం పాటు వేచి చూడాలని.. విడాకుల ప్రక్రియ పూర్తయ్యాక.. అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవచ్చని అనుకుంటున్నారట. దీంతో చై, సామ్‌ల కంబైన్డ్ స్నేహితులకు ప్రస్తుతం ఏం చేయాలో తెలియని అయోమయ స్థితి ఉందని చెప్పవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…