Samantha Workout : సమంత ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. వరుస సినిమాలు, సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉంటున్నప్పటికీ ఫొటోషూట్స్ చేయడం మానడం లేదు. అలాగే ఫిట్ నెస్‌పై కూడా ప్రత్యేక దృష్టి పెడుతోంది. అందులో భాగంగానే ఈమె ఇటీవలి కాలంలో జిమ్‌లో ఎక్కువగా గడుపుతోంది. తాజాగా ఈమె ఓ మ్యాగజైన్ కవర్ ఫొటోకు పోజులు ఇచ్చి అదరగొట్టింది. ఇక ఇప్పుడు జిమ్‌లో వ్యాయామం చేస్తూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. సమంత జిమ్ చేస్తుండగా.. తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫిట్ నెస్ ట్రెయినర్ సహాయంతో సమంత వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే భారీ ఎత్తున వ్యూస్, లైక్‌లు, కామెంట్లు వచ్చాయి. త్వరలో మరిన్ని చాలెంజింగ్ పాత్రల్లో నటించబోతున్నానని.. కనుకనే ఫిజికల్ ఫిట్‌నెస్ ముఖ్యమని సమంత తెలియజేసింది. చూస్తుంటే ఈమె త్వరలో యాక్షన్ సినిమాల్లో నటిస్తుందని సమాచారం. ఇక ఈ జిమ్ వీడియోలో ఆమె అందాలు వర్ణించనలవి కాకుండా ఉన్నాయి.
View this post on Instagram
సినిమాల విషయానికి వస్తే సమంత నటించిన తమిళ చిత్రం.. కాతు వాకుల రెండు కాదల్ ఈనెల 28వ తేదీన విడుదల కానుంది. యశోద అనే థ్రిల్లర్ మూవీ ఆగస్టులో రాబోతోంది. దీంతోపాటు శాకుంతలం అనే మూవీలో లీడ్ రోల్‌లో సమంత నటించగా.. ప్రస్తుతం ఈ చిత్రం గ్రాఫిక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఇక వీటితోపాటు పలు సిరీస్‌లతోనూ సమంత బిజీగా ఉంది.