Mahesh Babu : దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు ముగిసింది. సినిమా విడుదలై సంచలనాలను సృష్టిస్తోంది. ఇక కొన్ని రోజులు పోతే ఈ మూవీ హడావిడి అంతా సద్దుమణుగుతుంది. కానీ ఇప్పటికే రాజమౌళి తరువాతి సినిమా ఏమిటని.. ప్రేక్షకులు ఆరాలు తీస్తున్నారు. రాజమౌళి తన తదుపరి సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీస్తానని చెప్పిన విషయం విదితమే. అయితే అందుకు కొంత సమయం పట్టనుంది. ఈలోగా మహేష్.. దర్శకుడు త్రివిక్రమ్ సినిమాను చక చకా పూర్తి చేయనున్నారు. అప్పటి వరకు తారాగణం, షెడ్యూల్, కథ.. అన్నీ రెడీ చేయాలని జక్కన్న ఆలోచిస్తున్నారు.

అయితే ఆలు లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం.. అన్నట్లు.. ఇంకా సినిమా గురించి పూర్తి స్థాయిలో ఏమీ అనుకోలేదు.. అధికారికంగా ఏ వివరాలను ప్రకటించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం రక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మహేష్ – రాజమౌళి సినిమా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఉంటుందని వార్తలు వచ్చాయి. యాక్షన్ అడ్వెంచర్ కలబోతగా ఈ మూవీని రాజమౌళి తెరకెక్కిస్తారని అంటున్నారు. అయితే విజయేంద్ర ప్రసాద్ మాత్రం మహేష్ అభిమానుల అంచనాలను అందుకునేలా ఈ మూవీ ఉంటుందని.. అడవుల నేపథ్యంలోనే ఈ సినిమా కొనసాగుతుందని.. చిన్న హింట్ ఇచ్చారు. దీంతో మహేష్ అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.
అయితే తాజాగా ఇంకో వార్త హల్ చల్ చేస్తోంది. మహేష్ – రాజమౌళి సినిమా.. ఆదిత్య 369 మూవీని పోలి ఉంటుందని అంటున్నారు. అంటే అందులో మాదిరిగా టైమ్ మెషిన్ గట్రా.. ఉంటాయన్నమాట. అయితే ఇది అధికారిక సమాచారం కాదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తే. మరి ఇందులో నిజం ఎంత ఉంది.. అన్నది తెలియాలంటే.. కొంత కాలం వరకు వేచి చూడాల్సిందే..!