Samantha : 8 గంట‌లు ప‌ని చేసినందుకు.. స‌మంత అందుకుంది.. రూ.500..

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో స‌మంత ఒక‌రు. ఈవిడ ఇటీవ‌లి కాలంలో చేస్తున్న హంగామా మాములుగా ఉండ‌డం లేదు. ఒకవైపు సినిమాలు.. మరోవైపు వెబ్ సిరీస్‌లు, స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయిన సమంత సోషల్ మీడియాలో మాత్రం చాలా కాలంగా ఫుల్ బిజీగా ఉంటోంది. ఇందులో భాగంగానే తన సినీ, వ్యక్తిగత విషయాలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఫలితంగా భారీ స్థాయిలో ఫాలోవర్లను పెంచుకుంటోంది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత, నాగచైతన్యల విడాకుల విష‌య‌మే బాగా హాట్ టాపిక్ గా నడుస్తోంది.

Samantha

చైతూ, సామ్ విడిపోవ‌డానికి కార‌ణం ఏమై ఉంటుంది.. అనేది ఎవ‌రికీ తెలియ‌డం లేదు. ఎవరైనా వీళ్ళ మధ్య కావాలనే చిచ్చు పెట్టారా.. అంటూ ఇలా ఎన్నో ప్రశ్నల మీద ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కానీ వాళ్ళు పెట్టిన పోస్టులను బట్టి చూస్తే వాళ్ళ ఇష్టపూర్వకంగానే వాళ్ళు విడిపోయారని తెలుస్తుంది. కానీ వారి మధ్య జరిగిన కొన్ని సంఘటనల‌ గురించి మాత్రం బాగా చర్చలు న‌డుస్తున్నాయి. ఇదిలా ఉండ‌గా సమంత చాలా రోజుల తర్వాత తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ముచ్చటించింది. అభిమానులు, నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది.

ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ మీరు ఎప్పటికైనా వేసుకోవాలన్న టాటూ ఏంటి అని అడిగారు. దీనికి సమంత సమాధానమిస్తూ.. అసలు టాటూ వేయించుకోవాల‌నుకున్న ఆలోచన కూడా మానుకోండి అని బ‌దులు ఇచ్చింది. థియేటర్‌లో చూసిన ఫస్ట్‌ మూవీ ఏదని ఓ నెటిజన్‌ అడగ్గా జురాసిక్‌ పార్క్‌ అని జవాబిచ్చింది సామ్‌. అలాగే తన తొలి సంపాదన గురించి మాట్లాడుతూ.. హోటల్‌లో హోస్టెస్‌గా ఎనిమిది గంటలు పని చేసినందుకు రూ.500 ఇచ్చారని గుర్తు చేసుకుంది. అమ్మాయిల కోసం ఏదైనా స్ట్రాంగ్‌ మెసేజ్‌ ఇవ్వమని అడగ్గా.. మీపైన మీరు నమ్మకం పెట్టుకోండి. మీ కలలను సాకారం చేసుకునే దిశగా ప్రయత్నించండి.. అని సెలవిచ్చింది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM