Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో సమంత ఒకరు. ఈవిడ ఇటీవలి కాలంలో చేస్తున్న హంగామా మాములుగా ఉండడం లేదు. ఒకవైపు సినిమాలు.. మరోవైపు వెబ్ సిరీస్‌లు, స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయిన సమంత సోషల్ మీడియాలో మాత్రం చాలా కాలంగా ఫుల్ బిజీగా ఉంటోంది. ఇందులో భాగంగానే తన సినీ, వ్యక్తిగత విషయాలను తరచూ ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఫలితంగా భారీ స్థాయిలో ఫాలోవర్లను పెంచుకుంటోంది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత, నాగచైతన్యల విడాకుల విషయమే బాగా హాట్ టాపిక్ గా నడుస్తోంది.

చైతూ, సామ్ విడిపోవడానికి కారణం ఏమై ఉంటుంది.. అనేది ఎవరికీ తెలియడం లేదు. ఎవరైనా వీళ్ళ మధ్య కావాలనే చిచ్చు పెట్టారా.. అంటూ ఇలా ఎన్నో ప్రశ్నల మీద ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కానీ వాళ్ళు పెట్టిన పోస్టులను బట్టి చూస్తే వాళ్ళ ఇష్టపూర్వకంగానే వాళ్ళు విడిపోయారని తెలుస్తుంది. కానీ వారి మధ్య జరిగిన కొన్ని సంఘటనల గురించి మాత్రం బాగా చర్చలు నడుస్తున్నాయి. ఇదిలా ఉండగా సమంత చాలా రోజుల తర్వాత తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ముచ్చటించింది. అభిమానులు, నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది.
ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ మీరు ఎప్పటికైనా వేసుకోవాలన్న టాటూ ఏంటి అని అడిగారు. దీనికి సమంత సమాధానమిస్తూ.. అసలు టాటూ వేయించుకోవాలనుకున్న ఆలోచన కూడా మానుకోండి అని బదులు ఇచ్చింది. థియేటర్‌లో చూసిన ఫస్ట్ మూవీ ఏదని ఓ నెటిజన్ అడగ్గా జురాసిక్ పార్క్ అని జవాబిచ్చింది సామ్. అలాగే తన తొలి సంపాదన గురించి మాట్లాడుతూ.. హోటల్‌లో హోస్టెస్‌గా ఎనిమిది గంటలు పని చేసినందుకు రూ.500 ఇచ్చారని గుర్తు చేసుకుంది. అమ్మాయిల కోసం ఏదైనా స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వమని అడగ్గా.. మీపైన మీరు నమ్మకం పెట్టుకోండి. మీ కలలను సాకారం చేసుకునే దిశగా ప్రయత్నించండి.. అని సెలవిచ్చింది.