Samantha : విడాకుల ప్రకటన తర్వాత సమంత తన స్నేహితులతో కలిసి ఎంతో సంతోషంగా గడుపుతోంది. ఈ క్రమంలోనే తన స్నేహితురాళ్లతో కలిసి వివిధ తీర్థయాత్రలకు విదేశీ పర్యటనలు చేస్తూ ఎంతో సంతోషంగా గడుపుతున్న సమంత స్నేహితులలో ఒకరైన మంజుల అనగాని పుట్టినరోజు కావడంతో సమంత తనకు ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసింది. సమంత సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ చెప్పింది.
తనలాంటి ఫ్రెండ్ దొరకడం నిజంగా నా అదృష్టం అని వెల్లడించింది. తాను ఎంతో కఠినమైన పరిస్థితులలో ఉండగా తనకు అండగా నిలిచారని, ఇలాంటి నిజమైన ఫ్రెండ్స్ తనకు దొరకడం అదృష్టమని.. ఈ సందర్భంగా సమంత తెలిపింది. మంజుల, డైరెక్టర్ నందిని రెడ్డిలతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
https://www.instagram.com/p/CWAEwt1hn1M/?utm_source=ig_web_copy_link
ఇక సమంత సినిమాల విషయానికొస్తే ఈమె నటించిన శాకుంతలం త్వరలోనే విడుదల కానుంది. అదే విధంగా మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవే కాకుండా మరికొన్ని కథలను వింటోందని, నటి తాప్సీ ప్రొడక్షన్ లో సమంత బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.