Samantha : నటి సమంత ప్రస్తుతం వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్న విషయం విదితమే. నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన అనంతరం సమంత వరుస టూర్లు వేస్తోంది. అందులో భాగంగానే ఆమె తాజాగా స్విట్జర్లాండ్‌లో విహరిస్తోంది. ఈ క్రమంలోనే సమంత లేటెస్ట్‌గా ఓ పోస్ట్ పెట్టింది. అందులో పలు ఇంట్రెస్టింగ్ విషయాలను తెలియజేసింది.
తాను స్విట్జర్లాండ్‌లోని మంచు పర్వతాల్లో గత కొద్ది రోజులుగా మంచుపై స్కీయింగ్ చేస్తున్నానని.. ఇది చాలా గొప్ప అనుభూతి అని సమంత పేర్కొంది. అయితే తనకు స్కీయింగ్ చేసిన కొత్తలో సరిగ్గా రాలేదని.. దీనివల్ల తాను మంచులో 100 సార్లకు పైగా పడిపోయానని సమంత తెలిపింది. అయినప్పటికీ పట్టు వదలకుండా శిక్షణ తీసుకున్నానని.. దీంతో ఇప్పుడు బాగా స్కీయింగ్ చేస్తున్నానని.. ఇది జస్ట్ ఒక ఆరంభం మాత్రమే, ముందు ముందు ఇంకా చూస్తారు.. అని సమంత పోస్ట్ పెట్టింది.
తనకు స్కీయింగ్ నేర్పించిన కేట్ అనే శిక్షకురాలికి సమంత ఈ సందర్భంగా థ్యాంక్స్ చెబుతూ ఆమెతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది.
ప్రస్తుతం సమంత వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఇటీవలే పుష్ప మూవీలో ఐటమ్ సాంగ్ చేసి ఆకట్టుకోగా.. త్వరలో విజయ్ దేవరకొండ లైగర్‌లోనూ ఈమె ఐటమ్ సాంగ్ చేస్తుందని తెలుస్తోంది.