నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించినప్పటి నుంచి సమంత ఒంటరి జీవితాన్నే అనుభవిస్తోంది. వాస్తవానికి ఆమెకు తల్లిదండ్రులు ఉన్నప్పటికీ వారు చెన్నైలో స్థిర పడ్డారు. అందువల్ల సమంతతో వారు కలసి జీవించే అవకాశం లేదు. అయితే కారణాలు ఏమున్నా.. సమంత ప్రస్తుతం ఒంటరి జీవితాన్నే గడుపుతోంది. ఈ క్రమంలోనే ఆమె తీవ్రమైన డిప్రెషన్‌లో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు సాక్ష్యాన్ని కూడా కొందరు చూపుతున్నారు. ముంబై ఎయిర్‌పోర్టులో ఆమె చేతిలో ఉన్న పుస్తకమే.. ఆమె డిప్రెషన్‌తో బాధపడుతుందని చెప్పేందుకు ఉదాహరణ అని అంటున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
సమంత ఇటీవలే ముంబై ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చింది. పలు బాలీవుడ్ ప్రాజెక్టుల్లోనూ అవకాశాలు వస్తున్నందున ఆమె ముంబైకే మారిపోయింది. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరచూ వస్తూ ఇక్కడ షూటింగ్స్ చేస్తోంది. అయితే ముంబై ఎయిర్ పోర్టు నుంచి బయటకు వస్తూ కనిపించిన సమంత చేతిలో ఓ పుస్తకం పట్టుకుని దర్శనమిచ్చింది. దాని పేరు.. యూ కెన్ హీల్ యువర్ లైఫ్. దీన్ని ప్రముఖ రచయిత లూయిస్ హే రచించారు. ఈ క్రమంలోనే ఈ పుస్తకాన్ని సమంత చేతిలో చూడడంతో ఆమె తీవ్రమైన డిప్రెషన్‌లో ఉందని అంటున్నారు.
ఇక ఆ బుక్‌లో మానసిక ప్రశాంతతను సాధించడం, మనసును శరీరానికి అనుసంధానం చేయడం, భావోద్వేగాలపై అదుపు.. వంటి విషయాల గురించి ప్రస్తావించారు. ఈ క్రమంలోనే మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ బుక్ ఉపయోగపడుతుంది. అయితే సమంత చేతిలో ఈ పుస్తకాన్ని చూడడంతో ఆమె డిప్రెషన్ లో ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు. నాగచైతన్యతో విడాకులు తీసుకోవడం వల్ల ఆమె లైఫ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. ఆమెపై రోజు రోజుకీ నెగెటివిటీ ఎక్కువైపోయింది. దీంతో ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఆమె ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కనుకనే ఆ పుస్తకం చదువుతుందని అంటున్నారు. అయితే ఇందులో నిజం ఎంత ఉంది అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది.
ఇక సమంత ప్రస్తుతం బాలీవుడ్‌పై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ముంబైలో ఓ ఖరీదైన ఇంటిని ఈమె కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈమె రెండు వరుస బాలీవుడ్ చిత్రాలకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక తెలుగులో శాకుంతలం, ఖుషి, యశోద సినిమాలు లైన్‌లో ఉన్నాయి. ఇవి రానున్న రోజుల్లో విడుదల కానున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…