సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ ల వ్యవహారం ఎంతటి చర్చనీయాంశంగా మారిందో అందరికీ తెలిసిందే. వీరు ఒక హోటల్‌లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడడంతో వీరిపై ఉన్న గౌరవం కాస్తా పోయింది. అయితే అనూహ్యంగా వీరు హైలైట్ అయ్యారు. ఈ మధ్యే విడుదలైన పలు సినిమాల్లో వీరు కనిపించేసరికి ప్రేక్షకులు విజిల్స్ వేస్తూ చప్పట్లు కొట్టారు. అయితే పరువు పోయి అవకాశాలు తగ్గుతాయనుకున్న పవిత్రకు ఇంతటి రెస్పాన్స్ వచ్చేసరికి ఆమె తన పారితోషికాన్ని పెంచిందని తెలుస్తోంది. దీంతో నిర్మాతలు హైరానా పడుతున్నారట.
అసలే కరోనా కారణంగా టాలీవుడ్‌కు తీవ్రమైన దెబ్బ పడింది. దీనికి తోడు గోటి చుట్టుపై రోకలిపోటులా మరోవైపు ఓటీటీల కారణంగా థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో సినిమా పాజిటివ్ టాక్‌ను దక్కించుకున్నా రెండో రోజు నుంచే కలెక్షన్లు దారుణంగా పడిపోతున్నాయి. దీంతో నిర్మాతలు అందరూ షూటింగ్‌లను నిలిపివేసి సమస్యలు పరిష్కరించుకోవాలని చర్చిస్తున్నారు. అయితే ఖర్చులు తగ్గించుకోవడం అన్నది కూడా వారి సమస్యల్లో ఉంది. అందులో భాగంగానే నటీనటుల రెమ్యునరేషన్ ను తగ్గించాలని వారు చూస్తున్నారు. ఇప్పటికే హీరోలతో ఈ విషయం చర్చించి ఒక అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది.
అయితే ఈమధ్య తనకు లభించిన ఆదరణ కారణంగా పవిత్రా లోకేష్ తన రెమ్యునరేషన్‌ను పెంచిందట. మొన్నటి వరకు రోజుకు రూ.60వేలు తీసుకున్న ఆమె ఇప్పుడు ఏకంగా రూ.1 లక్ష వరకు డిమాండ్ చేస్తున్నదట. దీంతో అసలే నష్టాల్లో ఉండి నటీనటుల రెమ్యునరేషన్‌ను తగ్గించాలని చూస్తుంటే.. ఇప్పుడు పవిత్రా లోకేష్ ఇలా రెమ్యునరేషన్‌ను పెంచడం ఏమీ బాగాలేదని అంటున్నారట. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లో ఈమె వ్యవహారం మరోమారు చర్చనీయాంశం అయినట్లు తెలుస్తోంది. అయితే ఒక్క నటి కోసం నిర్మాతలు ఏమీ ఆలోచించరు. అందరికీ సౌకర్యంగా ఉండేలా చేస్తారు. కనుక ఆమెను పెద్దగా పట్టించుకోకపోవచ్చని తెలుస్తోంది. ఇక టాలీవుడ్ సమస్యలకు ఎప్పుడు పరిష్కారం లభిస్తుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…