నాగచైతన్య, సమంత గతేడాది అక్టోబర్‌లో విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. అంతకు ఒక నెల ముందే సమంత తన సోషల్ ఖాతాల్లో తన పేరు చివరన ఉన్న అక్కినేని అనే ఇంటి పేరును తొలగించి ఆంగ్ల అక్షరం ఎస్ ను చేర్చింది. దీంతో ఇద్దరూ విడిపోతున్నారని వార్తలు వచ్చాయి. చివరకు అవే నిజమయ్యాయి. వారు విడిపోతున్నామని సోషల్ మీడియా వేదికగా తమ తమ ఖాతాల ద్వారా ప్రకటించారు. అయితే వీరు ఎందుకు విడిపోయారు.. అన్న కారణాలు తెలియదు కానీ.. సమంతతో ఇంకా తనకు లింక్ పెట్టి చెప్పడాన్ని చైతూ సహించలేకపోతున్నాడట. ఈ మేరకు చైతన్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇటీవల చైతన్య ఓ ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విడాకుల తరువాత నా సినిమాలు మూడు రిలీజ్ అయ్యాయి. నేను ఇంకా సినిమాలకే అటాచ్ అయి ఉన్నా. నాకు సమంతతో లింక్ పెట్టడం ఏమీ బాగా లేదు. మేం విడాకులు తీసుకున్నాం. నన్ను, సమంతను కలిపి చెబుతూ వస్తున్న వార్తలతో విసిగిపోయా. నాకు బోరింగ్‌గా ఉంది. అలాంటి వార్తలు ఇక రాయొద్దని కోరుతున్నా.. అంటూ చైతూ ప్రత్యేక రిక్వెస్ట్ చేశాడు. ఈ క్రమంలోనే చైతన్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
కాగా నాగచైతన్య నటించిన థాంక్ యూ మూవీ ఇటీవలే రిలీజ్ కాగా.. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఘోర పరాజయం పాలైంది. తీవ్రంగా నిరాశపరిచింది. రెండో రోజే కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. అయితే ఈ నెల 11వ తేదీన చైతూ నటించిన లాల్ సింగ్ చడ్డా అనే మూవీ రిలీజ్ కానుంది. ఇందులో చైతూ ఆర్మీ ఆఫీసర్‌గా, అమీర్‌ఖాన్ ఫ్రెండ్‌గా కనిపించనున్నాడు. చైతూ రోల్ ఇందులో సుమారుగా 15 నిమిషాల పాటు ఉంటుందని తెలుస్తోంది. చైతూ పాత్ర పేరు ఇందులో బాలరాజు. కాగా ఫారెస్ట్ గంప్ అనే ఇంగ్లిష్ మూవీకి రీమేక్‌గా ఈ మూవీని నిర్మించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…