ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్ ప్రైమ్ మెంబర్లకు ఇప్పటికే ప్రారంభం అయింది. ఇక ఆగస్టు 6 నుంచి 10వ తేదీ వరకు ఈ సేల్ కొనసాగనుంది. ఇందులో మొబైల్స్‌పై 40 శాతం, ల్యాప్‌టాప్ లు, హెడ్ ఫోన్స్, స్మార్ట్ వాచ్ లపై 75 శాతం, టీవీలు, గృహోపకరణాలు, ఇతర వస్తువులపై ఏకంగా 60 శాతం వరకు డిస్కౌంట్లను అందిస్తున్నారు.
ఈ సేల్‌లో భాగంగా యాపిల్‌కు చెందిన ఐఫోన్ 13 ఫోన్‌ను రూ.11వేల తగ్గింపు ధరతో రూ.68,900కు కొనుగోలు చేయవచ్చు. అలాగే వన్ ప్లస్ 10 ప్రొ 5జి ఫోన్‌ను రూ.5వేల తగ్గింపుతో రూ.61,999కు, ఐక్యూ 9 ప్రొ 5జి ఫోన్‌ను రూ.5వేల తగ్గింపుతో రూ.55,990 ధరకు కొనుగోలు చేయవచ్చు. అలాగే షియోమీ 12 ప్రొ రూ.5వేల తగ్గింపుతో రూ.51,999 ధరకి లభిస్తోంది. అదేవిధంగా ఐక్యూ 95జి, షియోమీ 11టి ప్రొ, శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జి, ఐక్యూ 9ఎస్ఈ 5జి, ఐక్యూ జడ్6 ప్రొ 5జి ఫోన్లపై కూడా భారీ తగ్గింపు ధరలను అందిస్తున్నారు.
ఇక షియోమీ 11 లైట్ ఎన్ఈ 5జి, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జి, రియల్‌మి నార్జో 50, రెడ్‌మీ నోట్ 11 ఫోన్లపై కూడా తగ్గింపు ధరలను పొందవచ్చు. ట్యాబ్‌లెట్లపై 50 శాతం, ల్యాప్‌టాప్‌లపై రూ.40వేల వరకు, టీవీలపై 60 శాతం, స్మార్ట్ ఫోన్ కేసెస్‌పై 70 శాతం, హెడ్ ఫోన్స్‌పై 75 శాతం, కెమెరాలు, ప్రింటర్లు, గేమింగ్ యాక్ససరీలు, స్పీకర్లు, డేటా స్టోరేజ్ డివైస్‌లు, హై స్పీడ్ రూటర్లు, కంప్యూటర్ కాంపొనెంట్స్, సౌండ్ బార్స్, మానిటర్స్, వైఫై స్మార్ట్ హోమ్ సెక్యూరిటీ కెమెరాలు, అలెక్సా, ఫైర్ టీవీ డివైస్‌లు, కిండిల్ ఇ-రీడర్స్ తదితర ఉత్పత్తులపై 45 నుంచి 80 శాతం వరకు రాయితీలను అందిస్తున్నారు.
ఈ సేల్‌లో భాగంగా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో వస్తువులను కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. అదే డెబిట్ కార్డులతో అయితే రూ.5వేల వరకు డిస్కౌంట్‌ను ఇస్తారు. దీంతోపాటు ఈఎంఐ సదుపాయాన్ని కూడా పొందవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…