Samantha Naga Chaithanya : టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్‌గా ఉన్న సమంత, నాగచైతన్య ఇద్దరూ విడిపోవడం ఎంతో మందికి నచ్చడం లేదు. ఈ విషయాన్ని వారి అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే సమంత, నాగచైతన్య పిల్లల కోసం ప్లాన్ చేశారని.. ఇటీవలే నీలిమ గుణ చెప్పారు. అందువల్ల సమంత అబార్షన్ కు యత్నించిందని వస్తున్న వార్తలు నిజం కాదని ఆమె తేల్చేశారు. అయితే ఇప్పుడు ఇంకో కీలక విషయం బయట పడింది. అదేమిటంటే..
ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్.. లయన్ పేరిట అట్లీ దర్శకత్వంలో ఓ మూవీని నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. నయనతార ఈ మూవీలో నటిస్తోంది. అయితే నయనతార స్థానంలో అసలు సమంతనే ఈ మూవీలో చేయాల్సి ఉంది. కానీ సమంత పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నందున సినిమా షూటింగ్ సాధ్యపడదని.. కనుకనే అట్లీ ద్వారా వచ్చిన ఆఫర్‌ను తాను వదులుకుందని తెలుస్తోంది.
ఇక ఈ వాదనకు బలం చేకూర్చేలా నీలిమ గుణ మొన్నీ మధ్యే పలు కీలక విషయాలు చెప్పారు. తాను శాకుంతలం కోసం సమంత వద్దకు వెళ్లినప్పుడు ఆమె సినిమాకు ఒప్పుకుందని.. కానీ షూటింగ్‌ను మాత్రం ఈ ఏడాది ఆగస్టు వరకు పూర్తి చేయాలని చెప్పిందని.. ఎందుకంటే.. పిల్లల కోసం ప్లాన్ చేస్తుంది కనుక.. షూటింగ్ ను త్వరగా ముగించాలని కోరిందని.. నీలిమ గుణ చెప్పారు. అయితే లయన్ సినిమా షూటింగ్ ఇంకా ఆలస్యం అవుతుంది కనుక.. సమంత పిల్లల కోసం ప్లాన్ చేస్తుంది కనుక.. ఈ మూవీలో చేయడం కుదరదని అట్లీకి సమంత చెప్పిందట. అందువల్లే ఆమె స్థానంలో నయనతార చేస్తుందట.
దీంతో సమంత పిల్లల కోసం ప్లాన్ చేసినట్లు మరోసారి స్పష్టమైంది. అందువల్లే వేరే సినిమాలకు ఒప్పుకోలేదని తెలుస్తోంది. అయితే పిల్లల కోసం ప్లాన్ చేసిన వారు సడెన్ గా విడాకులు ఎందుకు తీసుకున్నారు ? అన్నది చిక్కు ప్రశ్నగానే మిగిలిపోయింది. కానీ సమంత, నాగచైతన్య విడాకుల విషయంలో క్రమంగా ఒక్కో సందేహం మాత్రం తీరుతూ వస్తోంది. మరి కొంత కాలానికైనా వారి విడాకులకు అసలు కారణం అనేది తెలుస్తుందా ? లేదా ? చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…