Chiranjeevi : రామ్ గోపాల్ వర్మ అంటేనే కాంట్రవర్సీలు. రిలాక్స్‌డ్ గా ట్విట్టర్ ముందు కూర్చుని ఎక్కడెక్కడ గొడవలు జరుగుతున్నాయా.. ఎవర్ని కామెంట్ చేద్దామా అని చూస్తుండటం వర్మ స్పెషాలిటీ. ఎక్కడ లేని గొడవలను చూసి మరీ వివాదాస్పద దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన ఆర్జీవీ.. ఇప్పుడు ఆయన తీసే సినిమాల్ని ప్రేక్షకులు ఆదరించడం లేదు. నాగార్జున హీరోగా శివ సినిమాతో ట్రెండ్ ని సెట్ చేసిన ఘనత రామ్ గోపాల్ వర్మకే దక్కింది.
ఆ తర్వాత నాగార్జున, వెంకటేష్ లతో బ్లాక్ బస్టర్ ప్రాజెక్ట్స్ ని తెరకెక్కించారు. ఆ టైమ్ లోనే చిరు వరుస సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఏం చేయాలా అని ఆలోచిస్తూ.. అశ్వనీదత్ తో మాట్లాడారు. ఆయన వర్మతో సినిమా చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. ఆ టైమ్ లో వర్మ బాలీవుడ్ లో సంజయ్ దత్ తో కలిసి వర్క్ చేస్తున్నారు. సరిగ్గా అదే టైమ్ లో సంజయ్ దత్ ఓ కేసు విషయమై జైలుకి వెళ్ళడం, వర్మ ఖాళీ అవ్వడం చకచకా జరిగిపోయాయి. అప్పుడే చిరుతో సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ ఊర్మిళతో కలిసి చిరు సినిమా స్టార్ట్ చేశారు. ఒక షెడ్యూల్ పూర్తి కావడంతో సంజయ్ దత్ కి బెయిల్ వచ్చింది.
దీంతో ఆ మూవీ చేసేందుకు వర్మ ముంబాయి వెళ్ళాడు. ఆ తర్వాత చిరంజీవి సినిమా చేయలేనంటూ తెలిపారు. దాంతో చిరుకి కోపం వచ్చింది. ఆ తర్వాత హిట్లర్ సినిమా చేశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ని సాధించింది. వర్మ మళ్ళీ వచ్చి సినిమా చేస్తానని చెప్పడంతో.. లైఫ్ లో మళ్ళీ తనకు కనిపించకూడదని వార్నింగ్ ఇచ్చాడు చిరంజీవి. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు చిరంజీవికి, రామ్ గోపాల్ వర్మకు పడదు. అలా చిరు సినీ కెరీర్ లో రామ్ గోపాల్ వర్మతో ఒక్క సినిమా కూడా చేయలేదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…