Samantha : గత కొద్దిరోజుల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే అది.. సమంత, నాగ చైతన్యల విడాకుల విషయం అనే చెప్పవచ్చు. అక్టోబర్ 2వ తేదీన వీరు విడాకుల విషయాన్ని ప్రకటించినప్పటి నుంచి వీరి గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు పుట్టుకొచ్చాయి. విడాకుల విషయంలో తప్పు మొత్తం సమంతదే అంటూ.. కొందరు పోస్టులు పెట్టడంతో.. సమంత వాటికి రిప్లైగా ఎంతో భావోద్వేగమైన పోస్టులు చేసింది.
విడాకుల ప్రకటన తర్వాత కొన్ని రోజులపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న సమంత ప్రస్తుతం తన బాధలను మర్చిపోవడం కోసం సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన అభిప్రాయాలను పంచుకుంటోంది. ఈ క్రమంలోని తాజాగా సమంత ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేసిన వీడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఈ సందర్భంగా సమంత పోస్ట్ చేస్తూ.. స్నేహ దేషూ నాపై నీ అధికారం ఏంటి.. నువ్విక్కడ లేకపోయినా భయం వేస్తోంది. ఎవరు చెప్పినా 30 కిలోల బరువు ఉన్న డంబెల్ వైపు కన్నెత్తి కూడా చూడను.. అలాంటిది నాలో సగం బరువు ఉన్నదానితో వర్కౌట్స్ చేస్తున్నా.. అంటూ వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్నేహ దేషూ.. సమంత జిమ్ ట్రైనర్.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…