Samantha Naga Chaithanya : టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్‌గా పేరుగాంచిన సమంత, నాగచైతన్యలు విడిపోయి ఉండకుండా ఉంటే ఈ రోజు 4వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటుండేవారు. కానీ విధివశాత్తూ వారు విడిపోయారు. అందుకు కారణాలు ఏమున్నప్పటికీ వారు విడిపోవడం చాలా మందిని బాధకు గురి చేస్తోంది. అయితే గతేడాది ఇదే రోజున వివాహ వార్షికోత్సవం సందర్భంగా సమంత పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Samantha Naga Chaithanya : నువ్వు నా వాడివి
“నువ్వు నా వాడివి, నేను నీ దాన్ని, మనం ఏం చేసినా ఇద్దరం కలిసే చేద్దాం, హ్యాప్పీ యానివర్సరీ హజ్బెండ్ చై అక్కినేని..” అంటూ సమంత గతేడాది పోస్టు చేసింది. అయితే ఆ పోస్టును చూసిన ఫ్యాన్స్ కన్నీటి పర్యంతం అవుతున్నారు.
https://www.instagram.com/p/CF_MKk0hj6P/?utm_source=ig_embed&ig_rid=fff19f00-bde1-4d8d-b00a-77f4f3cd6b73
చాలా మంది వారు విడిపోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే గతేడాది వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా సమంత పెట్టిన పోస్టును ఇప్పుడు ట్రెండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా.. ఈ ఇద్దరూ విడిపోవడం చాలా మందికి నచ్చడం లేదు.