Prabhas : ప్రభాస్ సినిమా అప్‌డేట్స్ అంటేనే అభిమానులకే కాదు.. ఇండస్ట్రీలో కూడా చాలా క్రేజ్ నెలకొని ఉంటుంది. త్వరలో ఆయన 25వ సినిమా తెరకెక్కనుండగా, ఈ సినిమా ఎవరి దర్శకత్వంలో రూపొందుతుందనే దానిపై కొన్నాళ్లుగా అనేక వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ 25వ సినిమాను సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది. అర్జున్ రెడ్డి సినిమాను డైరెక్ట్ చేసి ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న సందీప్ అదే సినిమాని హిందీలో కబీర్ సింగ్ పేరిట రీమేక్ చేశారు. ఈ చిత్రం మంచి విజయం సాధించింది.
సందీప్ రెడ్డితో ప్రభాస్ 25వ సినిమాపై రేపు (అక్టోబర్ 7, 2021) అప్‌డేట్ ఇవ్వనున్నట్టు టీ సిరీస్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందించనున్నారని టాక్. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ప్రస్తుతం ప్రభాస్ సలార్, ఆదిపురుష్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. సలార్ సినిమాను కేజీఎఫ్ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తుండగా ఆదిపురుష్ చిత్రాన్ని ఓం రావత్ తెరకెక్కిస్తున్నాడు.
Watch this space!! pic.twitter.com/T8Bmip09sx
— T-Series (@TSeries) October 6, 2021
మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ ను ఇటీవల సెట్స్ పైకి తీసుకువచ్చారు ప్రభాస్. ఆ సినిమాను కూడా ప్రభాస్ వీలైనంత తొందరగా పూర్తి చేయాలని ఒక టార్గెట్ అయితే సెట్ చేసుకున్నాడు. ప్రభాస్ ఒకేసారి గ్యాప్ లేకుండా మూడు సినిమాలతో బిజీ కాబోతున్నాడు. పక్కా ప్రణాళికతోనే ప్రభాస్ ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రం సంక్రాంతికి విడుదల కానున్న విషయం తెలిసిందే.