Samantha Naga Chaithanya : అక్కినేని అభిమానులకు ఇది ఒక చేదు వార్త అని చెప్పవచ్చు. ఇన్ని రోజుల నుంచి వీరి గురించి వస్తున్న వార్తలలో నిజం లేదంటూ సంతోషపడిన అభిమానులకు నాగచైతన్య ఓ చేదు వార్తను తెలియజేశారు. సమంత, చైతన్య వారి పెళ్లి బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వస్తున్న వార్తలు నిజమంటూ తాజాగా నాగచైతన్య తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా చేసిన పోస్టుతో తెలిసిపోయింది.
ఇన్‌స్టాగ్రామ్ వేదికగా నాగచైతన్య తన విడాకుల విషయాన్ని అధికారికంగా తెలియజేశారు. ఇన్ని రోజులు భార్యాభర్తలుగా కొనసాగుతున్న తామిద్దరం విడిపోతున్నామని, ప్రస్తుతం ఎవరి దారి వారం చూసుకోబోతున్నామని.. గత పది సంవత్సరాల నుంచి మంచి స్నేహ బంధంతో ఉండి పెళ్లి బంధంతో ఒక్కటైన తాము ఇకపై ఎవరిదారి వారు చూసుకోబోతున్నామని తెలియజేశారు.
https://www.instagram.com/p/CUharJFJsoU/?utm_source=ig_web_copy_link
ఎంతో ఆలోచించే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని తెలియజేశారు. ఈ విధమైన క్లిష్ట పరిస్థితులలో ప్రేక్షకులు, అభిమానులు మీడియా తమకు సపోర్ట్ చేయాలని ఈ సందర్భంగా నాగచైతన్య ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. ఈ పోస్ట్ చూసిన అభిమానులు ఇది కరెక్ట్ డెసిషన్ కాదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ నాగచైతన్య, సమంత విడిపోవడం వారి అభిమానులకు ఎంతో బాధాకరమైన విషయమని చెప్పవచ్చు.