Love Story : శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా సెప్టెంబర్ 24వ తేదీన థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. మొదటి నాలుగు రోజులు కలెక్షన్ల పరంగా బాగా వసూలైన ఈ సినిమా ఆ తర్వాత పలు కారణాల చేత కలెక్షన్లు తగ్గాయని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా.. అంటూ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక థియేటర్లలో విడుదలైన 50 రోజులకు ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. ఈ నేపథ్యంలోనే లవ్ స్టోరీ సినిమా దీపావళికి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోందని తెలుస్తోంది.
అయితే దీనికి సంబంధించిన విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటన చేయబోతోంది. థియేటర్ లో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో రన్ అవుతూ 1000 థియేటర్లకు పైగా విడుదల కాగా ఈ సినిమా మొదటి రోజున రూ.6.94 కోట్ల రేంజ్ షేర్ ని సొంతం చేసుకోగా.. టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ రూ.16.8 కోట్ల మార్క్ ని దాటిందని సమాచారం.