Chiranjeevi : మెగాస్టార్ దెబ్బ‌కు స‌మంత షాక్..? ఈ అమ్మ‌డు త‌ట్టుకుంటుందా..?

Chiranjeevi : ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో స‌మంత ఒక‌రు. ఈ అమ్మ‌డు గ‌త కొద్ది కాలంగా హాట్ టాపిక్‌గా మారుతోంది. స‌మంత ఇటీవ‌ల లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. జయాప‌జయాలు అనేది లేకుండా సినిమాలు చేస్తోంది స‌మంత‌. సమంత న‌టించిన శాకుంత‌లం చిత్రంతోపాటు ఓ త‌మిళ చిత్రం కూడా విడుద‌ల‌కి సిద్ధంగా ఉన్నాయి. పాన్ ఇండియా చిత్రం యశోద రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఆగస్టు 12న ఇది విడుద‌ల కానుంది. దీంతో మాజీ వదిన, మరిది మధ్య పోటీ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక్కడ ఊహించని ట్విస్ట్ మరొకటి జరగబోతోంది. ఏప్రిల్ 29న మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రం రిలీజ్ కు రెడీ అవుతోంది. కొన్ని నెలల గ్యాప్ లోనే చిరు మరో చిత్రంతో రాబోతున్నారు.

Chiranjeevi

ఆగ‌స్ట్ 12న చిరంజీవి గాడ్ ఫాద‌ర్‌ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అదే రోజున అఖిల్ ఏజెంట్ చిత్రం కూడా రిలీజ్ కానుంది. మలయాళీ బ్లాక్ బస్టర్ లూసిఫెర్ రీమేక్ లో చిరు నటిస్తున్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ గా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని ఆగష్టు 11న రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక జరిగితే సమంత యశోద చిత్రానికి చిక్కులు తప్పవు. గాడ్ ఫాదర్ రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించిన తర్వాత యశోద చిత్ర యూనిట్ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మెగాస్టార్ చిరంజీవి నుంచి తక్కువ గ్యాప్ లో రెండు చిత్రాలు రిలీజ్ కానుండడం ఊహించని పరిణామమే.

ఇదిలా ఉండ‌గా అమీర్ ఖాన్‌తో నాగ చైత‌న్య క‌లిసి చేసిన లాల్ సింగ్ చ‌ద్దా సినిమా కూడా అదే స‌మ‌యంలో విడుద‌ల కానుంది. ఈ స‌మ‌యంలో ఈ సినిమాని పోస్ట్ పోన్ చేయలేరు. ఇక వెన‌క్కి వెళితే అఖిల్ హీరోగా చేసిన ఏజెంట్ మూవీ లేదా స‌మంత టైటిల్ పాత్ర‌లో నటిస్తోన్న‌య‌శోద సినిమాలే వెన‌క్కి వెళ్లాల్సి ఉంటుంది. ఒక‌వేళ ఎవ‌రూ వెన‌క్కి త‌గ్గ‌క‌పోతే.. థియేట‌ర్స్ ఎలా స‌ర్దుబాటు అవుతాయ‌నేది ఆలోచించాల్సిన విష‌య‌మే. అయితే అఖిల్‌, స‌మంత.. ఇద్ద‌రినీ పోల్చి చూస్తే.. అఖిల్ అక్కినేని హీరో క‌నుక‌.. ఆయ‌న మూవీ విడుద‌ల‌ను ఆప‌లేరు. దీంతో ఎటు తిరిగి స‌మంత మూవీకే ఎస‌రు త‌గిలేలా క‌నిపిస్తోంది. అయితే గాడ్ ఫాద‌ర్ రిలీజ్ డేట్ ను ప్ర‌క‌టిస్తే.. అది ఆగ‌స్టు 11 లేదా 12 అయితే అప్పుడు య‌శోద మేక‌ర్స్ ఒక ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇక అవే తేదీల్లో గాడ్ ఫాద‌ర్ ను రిలీజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టిస్తే.. స‌మంత సినిమాకే ఎక్కువ ముప్పు ఉంటుంద‌ని తెలుస్తోంది. మ‌రి ఈ విష‌యంలో ఏం జ‌రుగుతుందో చూడాలి.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM