Kriti Sanon : కృతి సనన్.. ఈ అమ్మడు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. డైరెక్టర్ సుకుమార్, సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ లో వచ్చిన వన్ నేనొక్కడినే మూవీతో తెలుగుప్రేక్షకులను పలకరించింది కృతి సనన్. ఈ సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్నది. సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్ గా ఉంటుంది కృతి. ప్రస్తుతం ప్రభాస్‌తో ఆదిపురుష్ లో సీతగా నటిస్తున్న కృతి సనన్ తెగ సందడి చేస్తోంది. బాలీవుడ్‌లో అలరిస్తున్న కృతి సనన్ ఫొటో షూట్ లు చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తోంది.
తెలుగులో రెండు సినిమాల్లో మెరిసిన కృతి సనన్ ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోంది. బచ్చన్ పాండే, షేహజాదా, బేదియా, గణపత్, ఆదిపురుష్ చిత్రాల్లో నటిస్తోంది ఈ బ్యూటీ. వీటితోపాటు చాలా రోజుల తర్వాత తెలుగులోకి రీఎంట్రీ ఇస్తూ ఆదిపురుష్ చిత్రంలో నటిస్తోంది. ఇందులో ఆమె సీత పాత్రలో కనిపిస్తుండటం విశేషం. ఈ సినిమా ఆగస్ట్ 11న విడుదల కానుంది. ఇదిలా ఉండగా కృతి సనన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కసరత్తులకి సంబంధించిన వీడియోను షేర్ చేసింది. ఇందులో అనేక రకాల వర్కవుట్స్ చేస్తూ కనిపించింది.
జిమ్‌లో కసరత్తులు చేస్తూ ఎప్పటికప్పుడు అలరిస్తూ ఉండే కృతి.. తన అందచందాలతో ఆకట్టుకుంటోంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన కృతి సనన్ హీరోయిన్ అయ్యింది తెలుగు సినిమాతోనే. 2014లో మహేష్-సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన వన్ నేనొక్కడినే చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. భారీ అంచలనాల మధ్య విడుదలైన నేనొక్కడినే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. మహేష్ మూవీ తర్వాత తెలుగులో నాగ చైతన్యకు జంటగా దోచేయ్ మూవీ చేసింది. కాలేజ్ స్టూడెంట్ గా కృతి అదరగొట్టింది. ఈ సినిమా సైతం ఆమెకు హిట్ ఇవ్వలేదు. కృతి గ్లామర్ కు తెలుగు ప్రేక్షకులు పడిపోయినా.. హిట్ దక్కకపోవడంతో ఇక్కడ అవకాశాలు తగ్గాయి. అదే సమయంలో ఆమెకు బాలీవుడ్ లో ఆఫర్స్ మొదలయ్యాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…